జియో మరో బంపర్ ఆఫర్... రోజూ 4.5జీబీ డేటా ఫ్రీ

బుధవారం, 20 జూన్ 2018 (11:22 IST)

టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ మొబైల్ వినియోగదారులు అడక్కుండానే రోజుకు 4.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే, ఈ డేటా పొందాలంటే నెలకు రూ.299 ప్లాన్‌లో రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంది. ఈ ప్యాక్ కాలపరిమితి 28 రోజులు.
reliance jio
 
అంటే నెలకు రూ.299 ప్యాక్ తీసుకుంటే.. 28 రోజులపాటు ప్రతిరోజు 4.5జీబీ డేటా లభించనుంది. మొత్తంగా 126జీబీ డేటా పొందనున్నారు కస్టమర్లు. మరి ఏ ఇతర కంపెనీ నెట్ వర్క్‌లోనూ ఈ ప్యాక్ రేటులో ఇంత డేటా ఇస్తున్న దాఖలాలు లేవు. డేటా ఎక్కువ ఉపయోగించుకునే వారికి జియోలో ఇది బెస్ట్ ప్యాక్ అంటోంది మార్కెట్. 
 
ఈ ఆఫర్‌ ప్రకటించడానికి గల కారణాలు లేకపోలేదు. త్వరలోనే ఐడియా - వోడాఫోన్ టెలికాం కంపెనీలు ఒక్కటి కానున్నాయి. ఇదే జరిగితే టెలికాం రంగంలో ఐడియా అతి పెద్ద కంపెనీగా అవతరించనుంది. దీంతో ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఐడియా-వొడాఫోన్ విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే జియే ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించడం గమనార్హం. దీనిపై మరింత చదవండి :  
టెలికాం ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్ Telecom Data Reliance Jio Prepaid Plan Unlimited Calling రిలయన్స్ జియో

Loading comments ...

ఐటీ

news

రిలయన్స్ జియో అదుర్స్.. అన్నీ ప్లాన్లలో అదనంగా ఉచిత డేటా..!

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. టెలికాం రంగం సంస్థలకు ...

news

జీడీపీఆర్ అంటే ఏమిటి.. సమాచార భద్రత సాధ్యమేనా?

సీఆర్ఐఎఫ్ హైమార్క్ ద్వారా జీడీపీఆర్ అమల్లోకి వచ్చింది. డేటా సంరక్షణ కోసం ఈ ఏడాది మే 25న ...

news

రిలయన్స్ జియోకు పోటీ- రూ.597తో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం ...

news

రూ.99 ప్లాన్‌లో మార్పులు చేసిన ఎయిర్‌టెల్.. జియో దెబ్బకు...

రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరల విషయంలో రోజురోజుకూ ...