Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మార్చి 31, 2018 వరకు 10జీబీ ఉచిత డేటా.. జియో సంచలనం

మంగళవారం, 11 జులై 2017 (14:44 IST)

Widgets Magazine

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకునే రీతిలో అసస్ (Asus) స్మార్ట్ ఫోన్లు కొనే వారికి అదనంగా డేటా ఆఫర్లను జియో ప్రకటించింది.

Asus ZenFone Selfie, Asus ZenFone Max, Asus ZenFone Live, Asus ZenFone Go 4.5, Asus ZenFone Go 5.0, Asus ZenFone Go 5.5 వంటి అసస్ మోడల్స్‌ కొనే వారికి జియో డేటా ఆఫర్లను అందించనుంది. 
 
వినియోగదారులు అసస్ మొబైల్ తీశాక జియో సిమ్ కార్డును కూడా పొందాలి. ఆపై ప్రైమ్ మెంబర్‌‌గా చేరాలి. తర్వాత రూ.309లకు రీఛార్జ్ చేసుకుంటే 1 జీబీ డేటాతో పాటు 10జీబీ డేటాను అదనంగా అదీ ఉచితంగా పొందవచ్చును. అంతేగాకుండా ఈ అదనపు ఉచిత డేటా ఆఫర్ మార్చి 31, 2018 వరకు లభిస్తుందని జియో ప్రకటించింది.
 
మరోవైపు.. రిలయన్స్ తమ డేటా ఆఫర్లను రివైస్ చేసే పనిలో పడింది. డేటా ఆఫర్లు రూ. 19 నుంచి రూ. 9,999 వరకు వున్నాయని.. కొత్తగా రూ.349, రూ.399 ప్లాన్లను కూడా ప్రవేశపెట్టినట్లు జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ధనాధన్ ప్లాన్లను డిఫరెంట్ వ్యాలీడిటీలతో రూ.309, రూ.509లకు వినియోగదారులకు అందించనుంది. రూ.309, రూ.509 ప్లాన్లలో.. రూ.309 ప్రకారం అన్ లిమిటెడ్ డేటా (రోజుకు 1జీబీ డేటా), 56 రోజుల వ్యాలిటీతో ఎస్సెమ్మెస్, వాయిస్ కాలింగ్స్ పొందవచ్చు. అలాగే రూ.509 ప్లాన్ ప్రకారం రోజుకు జీబీ డేటా పొందవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అమేజాన్ ప్రైమ్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 7 రూ.42,999కే.. వేలాది డిస్కౌంట్లు..

ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ప్రైమ్ సేల్ అదిరిపోతుంది. సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ...

news

పదేళ్ల తర్వాత ఐటీ హబ్స్‌లో 20 శాతం దాకా పతనమవనున్న అద్దెలు

ఐటీ ఉద్యోగులు రాజభోగాలు అనుభవించినంత కాలం వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన ఇంటియజమానుల పంట ...

news

షాకింగ్ న్యూస్ : జియో కస్టమర్ల సమాచారం లీక్?

షాకింగ్ న్యూస్. రిలయన్స్ జియో కస్టమర్ల సమాచారం లీక్ అవుతోంది. కస్టమర్ డేటాబేస్ హ్యాక్ ...

news

ఉద్యోగి తొలగింపులో అడ్డంగా దొరికిపోయిన టెక్ మహేంద్రా.. సారీ చెబితే ఏంటి.. పరువు పోయె

ఒక ఉద్యోగిని అర్థంతరంగా కంపెనీ నుంచి తొలగిస్తున్న సమయంలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ ...

Widgets Magazine