Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అంతర్జాతీయ టెలికాం మార్కెట్‌పై జియో కన్ను.. రూ.501 రీఛార్జ్ చేసుకుంటే?

గురువారం, 20 ఏప్రియల్ 2017 (13:24 IST)

Widgets Magazine
JioFi

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అంతర్జాతీయ టెలికామ్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఐఎస్‌డీ కాల్ రేట్స్‌కు సంబంధించి ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.501తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా నిమిషానికి ఇంటర్నేషనల్ కాల్స్‌కు మూడు రూపాయల చొప్పున చెల్లించి పొందవచ్చునని జియో తెలిపింది. దీనిని రేట్ కటర్ ప్లాన్‌గా జియో ప్రకటించింది. 
 
అంతేకాదు, 501 రూపాయలతో రీచార్జ్ చేయిస్తే సర్వీస్ యాక్టివేషన్‌తో పాటు పూర్తి మొత్తంలో బ్యాలెన్స్ కూడా పొందొచ్చు. ఇందులో భాగంగా అమెరికా, ఇంగ్లండ్, కెనడా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమవారికి భారత్ నుంచి కేవలం నిమిషానికి 3రూపాయలు చెల్లించి కాల్స్ చేసుకోవచ్చునని జియో ప్రకటించింది. 
  
ఈ ఐఎస్డీ కాల్స్ హాంకాంగ్, ఇటలీ, మంగోలియా, మొరాకో, న్యూజిలాండ్, పోలాండ్, పోర్చుగల్,  అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, రొమానియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్ దేశాలకు కూడా నిమిషానికి 3 రూపాయలు చెల్లించి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది.
 
మరోవైపు రిలయన్స్ జియో మరో సంచలనమైన ఆఫర్‌ను ప్రకటించింది. తాజాగా శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్ 8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలు చేసిన వారికి జియో బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన జియో యూజర్లకు డబుల్ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొత్తగా శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి 448 జీబీ 4 జీ డేటాను 8 మాసాలపాటు ఉచితంగా అందించనున్నట్టు జియో ప్రకటించింది. అయితే నెలకు రూ.309 లతో రీచార్జీ చేసుకోవాలని జియో ప్రకటించింది. అలాగే ధనాధన్ ప్లాన్ కిందే ఈ ఆఫర్ ను తెచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

వామ్మో.. తప్పుడు ప్రకటనలు.. ఎయిర్‌టెల్, అముల్, ఆపిల్, కోక్ సంస్థలు కూడా?

జియో ఆఫర్లతో వినియోగదారుల పంట పండుతోంది. ఇందుకు పోటీగా టెలికాం సంస్థలన్నీ పోటాపోటీగా ...

news

6000 మంది టెలికాం ఉద్యోగుల మెడపై కత్తి : రిక్రూట్‌మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ వార్నింగ్

టెలికాం రంగంలో ఈ యేడాది ఆరు వేల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ...

news

టెలినార్‌ కొత్త ఆఫర్‌... రూ.73కే అపరిమిత 4జి డేటా... జియో షాక్

దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన టెలినార్ సంస్థ తాజాగా బంపర్ ఆఫర్‌ను ...

news

ప్రైమ్ సభ్యత్వం తీసుకోని కనెక్షన్లు కట్... రిలయన్స్ జియో నిర్ణయం

దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు గట్టి షాకివ్వనుంది. ...

Widgets Magazine