Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో సంక్రాంతి ఆఫర్.. రోజుకు 5జీబీ డేటా

బుధవారం, 10 జనవరి 2018 (16:00 IST)

Widgets Magazine
reliance jio

రిలయన్స్ జియో మరో రెండు కొత్త ఆఫర్లను ప్రకటించింది. సంక్రాంతి ఆఫర్‌ కింద వీటిని తాజాగా వెల్లడించింది. గతవారం పలు ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను రూ.50 వరకు తగ్గించడంతోపాటు కొన్ని ప్లాన్లకు 50 శాతం అదనపు డేటాను అందిస్తూ ఆయా ప్లాన్ల ధరలను మార్చిన విషయం తెలిసిందే. 
 
కాగా జియో దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు కూడా పలు ప్లాన్ల టారిఫ్‌లకు అందించే డేటా, వాలిడిటీ బెనిఫిట్స్‌ను పెంచాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మళ్లీ జియో రంగంలోకి దిగింది. దీంతో తాను అందిస్తున్న రూ.509, రూ.799 ప్లాన్ల బెనిఫిట్స్‌ను మార్చేసింది. 
 
ఈ ప్లాన్లలో భాగంగా, రూ.509 ప్లాన్‌లో ఇప్పటివరకు రోజుకు 2 జీబీ డేటా ఇచ్చేది. దీన్ని ఇకపై 3జీబీ డేటాకు పెంచింది. అయితే, కాలపరిమితిని మాత్రం 49 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించింది. 
 
అలాగే రూ.799 ప్లాన్‌లో ఇప్పటివరకు రోజుకు 3జీబీ డేటా లభించగా ఇప్పుడు దాన్ని జియో రోజుకు 5జీబీ వరకు పెంచింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే, ఎయిర్‌టెల్‌లో రూ.799 ప్లాన్‌లో రోజుకు 3.5 జీబీ మాత్రమే లభిస్తుండడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది...

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది... ఈ మాట వినేందుకు ...

news

నోకియా 6 ఫీచర్స్ లీక్... 4 జీబీ ర్యామ్ - హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌... ఇంకా...

ప్రముఖ మొబైల్ మేకింగ్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ త్వరలో నోకియా 6 పేరుతో ఓ ...

news

జియో ఫీచర్ ఫోన్ ఇక.. అమేజాన్‌లో..

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం ఫీచర్ ఫోన్‌లను అమ్మకానికి ...

news

ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్: స్మార్ట్ ఫోన్లపై మొబైల్ బొనాంజా

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ-కామెర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్ ...

Widgets Magazine