మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (10:40 IST)

రిలయన్స్ జియో నుంచి చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయి

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ ''ఓరియో గో''తో పనిచేసే సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌న్లను లైఫ్ బ్రాండ్ల కింద విడుదల చేయనున్నట్లు జియో కంపెన వర్గాల సమాచారం. 
 
ఇప్పటికే తైవాన్‌కు చెందిన చిప్ మేకర్ మీడియా టెక్, గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖాతాదారులను కాపాడుకునేందుకు ఇతర టెల్కోలు కూడా చౌక ధరలో 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. అందుకే డెడ్లీ చిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనును మార్కెట్లోకి తీసుకురావాలని జియో నిర్ణయించింది.