గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (16:51 IST)

వాటే స్మార్ట్ ఫోన్ : 4 సిమ్ కార్డులు... 60 ఎంపీ కెమెరా, 1000 గిగాబైట్ల మెమొరీ...

ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌ను స్మార్ట్ ఫోన్లు ముంచెత్తున్నాయి. రోజుకో కంపెనీ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రోబోటిక్స్ అనే సంస్థ 'మెనోలిత్ చకోన్' అనే కొత్త స్మార్ట్

ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌ను స్మార్ట్ ఫోన్లు ముంచెత్తున్నాయి. రోజుకో కంపెనీ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రోబోటిక్స్ అనే సంస్థ 'మెనోలిత్ చకోన్' అనే కొత్త స్మార్ట్ ఫోన్ తయారు చేస్తోంది. ఈ ఫోన్ మార్కెట్‌లోకి 2018లో అందుబాటులోకి రానుంది. అయితే, ఈ ఫోన్ ఫీచర్లు మాత్రం అపుడే ఆన్‌లైన్, సోషల్ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నాయి. ఆ ఫీచర్లేంటో ఓసారి పరిశీలిస్తే... 
 
మొత్తం నాలుగు సిమ్ కార్డులు వేసుకునే సౌలభ్యం ఉండే ఈ స్మార్ట్ ఫోన్... 6.4 అంగుళాల టచ్ స్క్రీన్‌, 2160/3840 పిక్సెల్ రెజల్యూషన్, 1000 గిగాబైట్లకు పైగా మెమొరీ (1.2 జీబీ ఇంటర్నల్ మెమొరీ), వెనుకవైపు 60 ఎంపీ కెమెరా, ముందు 20 ఎంపీ కెమెరా, 18 జీబీ ర్యామ్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బ్యాటరీ, 2 మైక్రో ఎస్డీ కార్డులు తదితర సౌకర్యాలను కలిగివుంది. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర మాత్రం తెలియాలంటే 2018 వరకు ఆగాల్సిందే.