గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 మే 2015 (11:56 IST)

ఆన్ లైన్ కొనుగోళ్లలో మనదే హవా: 2018 నాటికి 55 కోట్లకు..?

రానున్న మూడేళ్లలో ఆన్ లైన్ కొనుగోళ్ల రారాజులం మనమేనని తాజా అధ్యయనాలు తేల్చాయి. ఇంటర్నెట్ వినియోగానికి బాగా అలవాటుపడిపోయిన యువత సినిమా టిక్కెట్ల దగ్గర్నుంచి, నిత్యావసర సరకుల వరకు అంతా ఆన్ లైన్‌ను మాధ్యమంగా చేసుకుంటుందని.. తద్వారా ఆన్ లైన్ కొనుగోళ్లలో భారతీయులదే హవా అని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో 2018 నాటికి ఆన్ లైన్ కొనుగోళ్ల దారులు 55 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. 
 
ఈ లెక్కన 2018 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులుగా మారే అవకాశం ఉంది. దీనికి కారణం మొబైల్ నెట్ వర్క్ సేవలు విస్తరించడమేనని, పల్లెల్లో కూడా నెట్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, ఆన్ లైన్ వ్యాపారం జోరుగా సాగనుందని సమాచారం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 6 కోట్ల మంది నెట్ వినియోగదారులుండగా, వీరి సంఖ్య 2018 నాటికి 28 కోట్లకు చేరుకుంటుందని అంచనా