బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (12:11 IST)

స్మార్ట్‌ఫోన్ల వాడకంతో చేతిబొటన వేలు పెరుగుతుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఇటీవలికాలంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేని యువతీయువకులు లేరంటే నమ్మశక్యం కాదేమో. అయితే, ఈ ఫోన్లను ఎంతగా ఉపయోగిస్తే అంత దుష్ఫలితాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తు

ఇటీవలికాలంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేని యువతీయువకులు లేరంటే నమ్మశక్యం కాదేమో. అయితే, ఈ ఫోన్లను ఎంతగా ఉపయోగిస్తే అంత దుష్ఫలితాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. 
 
అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారిలో బొటనవేలు పరిమాణం కొంతమేర పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెరుగుదలకు కండరాలు సిద్దంగా లేకపోవడం వల్ల అంతర్గత గాయాలవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా 18 నుంచి 34 ఏళ్ల వయసున్న యువతలో ఈ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకొచ్చారు.  
 
సామాజిక మాధ్యమాల వినియోగం, చాటింగ్‌, ఎస్ఎంఎస్‌లు పంపించడం తదితర పనుల వల్ల బొటనవేలులో మార్పులొస్తున్నాయని ఎముకలు, కండరాల వైద్య నిపుణులు అంటున్నారు. సో.. యువతీయువకులూ కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.