Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రంప్ చర్యలు ఇండియాకు ఆశీర్వాదం: ముఖేష్ అంబానీ ఆశాభావం

హైదరాబాద్, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (02:43 IST)

Widgets Magazine

హెచ్1 బి వీసాలను అడ్డుకుంటానని, వలసలను నిషేధిస్తానని, అమెరికాలో బయటివారికి ఉపాధి అవకాశాల్లో కోత విధిస్తానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను మారురూపంలో ఆశీర్వదిస్తున్నారని రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రశంసించారు. ఇండియాకు చెందిన 150 బిలియన్ డాలర్ల విలువైన సమాచార సేవల పరిశ్రమకు ట్రంప్ మారురూపంలో ఆశీర్వాదాన్ని అందిస్తున్నాడని ముఖేష్ అభిప్రాయపడ్డారు. 
 
ట్రంప్ మరోరకంగా భారత్‌ను ఆశీర్వదిస్తున్నారు. ఆయన చర్యలు భారత్ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టేందుకు భారతీయ టాలెంట్‌ మరియు ఐటీ పరిశ్రమను అవకాశం కల్పిస్తాయని అంబానీ చెప్పారు. డొనాల్ట్ ట్రంప్ పాలనాయంత్రాంగం తీసుకువస్తున్న రెగ్యులేటరీ మార్పుల గురించి భారతీయ టెక్నాలజీ పరిశ్రమ భయాందోళ నలు చెందుతూ విదేశాల్లో అత్యధికంగా ఉన్న తమ వాణిజ్య మార్కెట్‌ దెబ్బతింటుందని భీతిల్లుతున్న నేపథ్యంలో భారతీయ టాలెంటుకు తిరుగులేదని ఆశావహ దృక్పధం ప్రకటిస్తున్నారు. అంబానీ.. 
 
ప్రపంచం డిజిటలీకరణకు గురవుతున్నందున, పెద్ద సమస్యలను పరిష్కరించడానికి మనముందు అనేక అవకాశాలుండటాన్ని మనం దర్శిస్తున్నాం. భారతీయ మార్కెట్ ఎంత పెద్దదంటే రిలయెన్స్ జియో ప్లాట్‌ఫామ్ భారత సమస్యలను పరిష్కరించే తదుపరితరం భాగస్వామ్యాలను ప్రతిపాదిస్తోంది. ఇది మన జీవన ప్రమాణాలను పెంచడమే కాదు. మన పరిశ్రమలను మరింత ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉండేటట్టు మారుస్తోది అని అంబానీ చెప్పారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
డొనాల్డ్ ట్రంప్ చర్యలు భారతీయ టాలెంట్ ఆశీర్వాదం రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ Disguise India Mukesh Trump Blessing

Loading comments ...

ఐటీ

news

జియోకు గట్టిదెబ్బ.. భారత్ మార్కెట్‌పై అలీబాబా కన్ను.. ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తారట?

జియో ఉచిత డేటాతో దేశ ప్రజలకు సూపర్ ఆఫర్ ఇస్తే.. తాజాగా భారత్‌ మార్కెట్‌పై అలీబాబా ...

news

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. 'ఎక్స్పిరియెన్స్ ఎల్ఎల్ 49' పేరిట అపరిమిత కాల్స్..

జియో ఎఫెక్ట్‌తో ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ...

news

కాలం సరిహద్దులను చెరపనున్న డేటా స్పీడ్‌

టెక్నాలజీ ఆవిష్కరణలకు ఊతమిచ్చేది వేగం. పాత ఉత్పత్తులను మించిన నిపుణత మాత్రమే కాదు. పాత ...

news

గూగుల్‌ పిక్సల్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇపుడు జస్ట్ రూ.28 వేలకే సొంతం

సెర్చ్ దిగ్గజం గూగుల్ పిక్సల్‌ స్మార్ట్ ఫోన్ ఇపుడు భారీ డిస్కౌంట్ ధరకు లభించనుంది. ఈ ...

Widgets Magazine