శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (17:06 IST)

ఆల్గారిథమిక్ టైమ్ లైన్‌ను ప్రారంభించనున్న ట్విట్టర్

సోషల్ మీడియా పట్ల ముఖ్యంగా యువతకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో అగ్రపథంలో ఉన్న ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వాటి షేర్ల విలువ కూడా ఈ మధ్య బాగానే పెరిగింది. అయితే ట్విట్టర్ పరిస్థితి ఇందుకు వ్యతిరేకంగా ఉంది. ట్విట్టర్కు ఆదరణ తగ్గుతుండటం, ఆర్థికంగా నష్టాలు రావడం ఆ సంస్థను ఆలోచనలో పడేస్తోంది. గతేడాది చివరి మూడు నెలల్లో ట్విట్టర్లో 20 లక్షల మంది ఖాతాదారులు తగ్గడంతో షేర్ల విలువ 12 శాతం తగ్గినట్టు ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది.
 
ఇకపోతే 2015 చివరకు ట్విటర్లో 30.50 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఫేస్బుక్కు 160 కోట్లమంది ఖాతాదారులున్నారు. మరో సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రాం కూడా ట్విట్టర్ను దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్కు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అంటే ఫేస్‌బుక్ మొదటి స్థానంలో, ఇన్స్టాగ్రామ్ రెండవ స్థానంలో ఉన్నాయి. దీంతో ట్విట్టర్ కంటే మిగిలిన సామాజికమాధ్యమాలదే పైచేయిగా నిలుస్తోంది. 
 
ఫేస్‌బుక్, వాట్స్‌యాప్, ఇన్‌స్టాగ్రాం వంటివి పెరుగుతుండగా ట్విట్టర్ ఖాతాదారులు తగ్గడంతో ఫేస్‌బుక్ తరహాలో ఆల్గారిథమిక్ టైమ్ లైన్‌ను ప్రారంభించేందుకు ట్విట్టర్ సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తామని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ఆశాభావం వ్యక్తంచేశారు.