గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (11:14 IST)

సెల్‌ఫోన్‌ అక్కడ పెట్టుకోవచ్చు..! ఏమీ కాదు..!

సెల్‌ఫోన్‌ విడుదల చేసే రేడియో ధార్మిక శక్తి మగవారిలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుందనేది కేవలం అపోహేనని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా లోదుస్తులు తయారుచేసే కంపెనీలు చేసిన ప్రచారమని కొట్టిపారేస్తున్నార

సెల్‌ఫోన్‌ విడుదల చేసే రేడియో ధార్మిక శక్తి మగవారిలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుందనేది కేవలం అపోహేనని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా లోదుస్తులు తయారుచేసే కంపెనీలు చేసిన ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. తమ ఉత్పత్తుల (డ్రాయర్ల)ను వాడండి. సెల్‌ఫోన్ రేడియేషన్‌ నుంచి తప్పించుకోండనే ప్రచారం వల్లే ఈ అపోహలు వ్యాపించాయన్నారు. 
 
సెల్‌ఫోన్ రేడియో తరంగాల వల్ల వీర్యం ఉత్పత్తి, నాణ్యతను దెబ్బతీస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే రెండో ప్రపంచ యుద్థంలో రాడార్‌ కేంద్రంలో వాటి రేడియోధార్మికత ప్రభావం ఉండే చోట పనిచేసే సైనికుల్లో దీనికి భిన్నమైన నమ్మకం ఉండేది. వారు సెలవుల్లో ఇంటికెళ్ళే ముందు రేడియోతరంగాలు ప్రసారమయ్యేచోట పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారట. 
 
రేడియో ధార్మికత వల్ల కోల్పోయిన శక్తి (వీర్యం ఉత్పత్తి, సామర్థ్యం)ని ఈ రేడియో తరంగాల ద్వారా పొందవచ్చని వారి నమ్మకం. ఇందులో నిజానిజాలను తేల్చేందుకే నోబెల్ బహుమతి గ్రహీత హెర్మన్‌ ముల్లర్ పరిశోధనలు చేశారు. రేడియో తరంగాలు వీర్య ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపలేవని ఆయన తేల్చారు.