శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 19 మే 2017 (04:54 IST)

అతి భయంకర సైబర్ వైరస్‌కు భారతీయ సొల్యూషన్.. ఇదే మన మేధాశక్తి

ప్రపంచ సాఫ్ట్ వేర్ చరిత్రలోనే అతి భయంకరమైన వైరస్‌గా పేరొందిన వనా క్రై సైబర్‌ వైరస్‌కు విరుగుడును భారతీయ మేధా శక్తే పరిష్కరించనుంది. హైదరాబాద్‌కు చెందిన యూనిక్‌ సిస్టమ్స్‌ ఈ ఘనతను సాధించింది. జీరోఎక్స్‌టీ అని పిలవబడే ఈ సొల్యూషన్స్‌ను కాంప్లెక్స్‌ ఆల

ప్రపంచ సాఫ్ట్ వేర్ చరిత్రలోనే అతి భయంకరమైన వైరస్‌గా పేరొందిన వనా క్రై  సైబర్‌ వైరస్‌కు విరుగుడును భారతీయ మేధా శక్తే పరిష్కరించనుంది. హైదరాబాద్‌కు చెందిన యూనిక్‌ సిస్టమ్స్‌ ఈ ఘనతను సాధించింది. జీరోఎక్స్‌టీ అని పిలవబడే ఈ సొల్యూషన్స్‌ను కాంప్లెక్స్‌ ఆల్గరిథం ఆధారంగా అభివృద్ధి చేశామని యూనిక్‌ సిస్టమ్స్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీఈఓ చక్రధర్‌ కొమ్మెర తెలిపారు.
 
తాము రూపొందించిన జీరోఎక్స్‌టీ ప్రొడక్ట్‌ రాన్‌సమ్‌వేర్‌ సైబర్‌ దాడులు, అనధికార యాక్సెస్, డేటా లీకేజీ, డేటా సవరణ, విధ్వంసం వంటి క్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ దాడులను పరిష్కరిస్తుందని చక్రధర్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఇది దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు, ఆర్ధిక సంస్థల్లో పైలెట్‌గా విశ్లేషణ జరుగుతోందని.. త్వరలోనే దీన్ని మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. 
 
వనా క్రై దాడి కంటే ముందే సోని ఎంటర్‌టైన్‌మెంట్‌ హ్యాక్‌ సంఘటన అనంతరం జీరోఎక్స్‌టీ ప్రొడక్ట్‌ అభివృద్ధి చేసే పనిలో పరిశోధన మొదలుపెట్టామని ఆయన పేర్కొన్నారు.