Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూలై 6న వివో నుంచి ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్ ఫోన్లు: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు కూడా?

మంగళవారం, 27 జూన్ 2017 (19:39 IST)

Widgets Magazine

బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వివో కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. వివోకు చెందిన ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్' ఫోన్లకు 2017 వేరియంట్లను జూలై ఆరో తేదీన విడుదల చేయనుంది. ఈ రెండు ఫోన్లలోనూ ముందు భాగంలో రెండు సెల్ఫీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 
 
వివో నుంచి వేరియంట్ ఫోన్లు రెండింటిలోనూ యూజర్లకు ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఓఎస్ లభించనుంది. అలాగే వివో ఎక్స్9ఎస్ ప్లస్ 2017 ఫోన్‌లో 5.85 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 3950 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉంటాయి. ఈ రెండింటినీ మెటల్ బాడీతో రూపొందించారు. రెండూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.
 
ఇదిలా ఉంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ ‌షిప్ హక్కులను వివో సొంతం చేసుకుంది. 2017 సీజన్‌తో ఒప్పందం ముగియడంతో బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్షిప్ హక్కుల కోసం వేలం నిర్వహించింది. ఈ వేలంలో వివో 2018 నుంచి 2022 వరకు రూ. 2199 కోట్లతో బిడ్‌ దాఖలు చేసింది. ఇది గత కాంట్రాక్టుతో పోలిస్తే 554 శాతం అధికం కావడం విశేషం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియోనీ ఫోన్లలో జియో సిమ్‌లు వాడితే.. 4జీ డేటా ఫ్రీ..

మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ రిలయన్స్.. పలు ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం జియోనీ ఫోన్లలో ...

news

గూగుల్‌కు భారీ జరిమానా.. ఏకంగా 2.4 బిలియన్ యూరోల ఫైన్.. ఎందుకంటే?

గూగుల్‌కు భారీ జరిమానా పడింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ...

news

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటి...

ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న నోకియా.. ఇపుడు మళ్లీ మార్కెట్‌లోకి ఫోన్లను ...

news

ఫ్లిప్‌కార్ట్‌లో లెనోవో స్మార్ట్ ఫెస్టివల్.. భారీగా ధరల తగ్గింపు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లెనోవో ఫెస్టివల్‌ పేరుతో స్మార్ట్ ఫోన్లను భారీ ...

Widgets Magazine