Widgets Magazine Widgets Magazine

''వొడాఫోన్ సఖి'' ద్వారా మహిళలు ఇక ఫోన్ నెంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు..

శనివారం, 15 జులై 2017 (15:32 IST)

Widgets Magazine
vodafone logo

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని వొడాఫోన్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ''వొడాఫోన్ సఖి'' ప్లాన్‌తో ఇక ప్రైవేటుగా రీఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని వొడాఫోన్ కల్పించింది. తద్వారా ఇక నుంచి మహిళలు రీఛార్జ్ కోసం రిటైలర్లకు తమ ఫోన్ నెంబర్లను చెప్పాల్సిన పనివుండదు. దీంతో పాటు ప్రత్యేకంగా మహిళల కోసం రూ.52, రూ.78, రూ.99 రీఛార్జీ ప్యాకులను వొడాఫోన్ ప్రకటించింది. 
 
కాగా మహిళలు రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రైవేట్ అని 12604కి మెసేజ్ ఇస్తే ఒక వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఈ నెంబరును 24 గంటల్లోపు ఏదైనా రిటైల్ షాపులో చెప్తే చాలు. మీ నెంబర్ బహిర్గతం కాకుండా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యూపీ (పశ్చిమ), ఉత్తరాఖంఢ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్‌ను త్వరలో దేశవ్యాప్తం చేయనున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. 
 
వొడాఫోన్ సఖి ఆఫర్ రూ.52 నుంచి ప్రారంభం అవుతుంది. రూ.52లకు రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వ్యాలిడిటీతో 42 నిమిషాల టాక్ టైమ్ 50ఎంబీ 2జీ, 3జీ డేటా లభిస్తుంది. అలాగే రూ.78, రూ.99లకు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదే 30 రోజుల వ్యాలీడిటీతో 62 నిమిషాల టాక్ టైమ్ 50 ఎంబీ, 79 నిమిషాల టాక్ టైమ్‌తో 50 ఎంబీని పొందవచ్చును.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటో ఈ-4 భారీ సేల్.. 24 గంటల్లోనే లక్ష ఫోన్లు అమ్ముడుబోయాయి..

ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంచిన ‘మోటో ఈ 4’ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు కేవ‌లం 24 ...

news

ఐటీ జాబ్‌ పోయిందా.. భీతిల్లవద్దు.. మీకోసం స్కాలర్‌షిప్‌తో ట్రయినింగ్ రెడీ

గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని దేశీయ ఐటీ రంగం ఎదుర్కొంటోంది. రెండు ...

news

ఫ్లిఫ్ కార్టులో రూ.999లకు మోటో ఇ4 ప్లస్..

ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిఫ్ కార్ట్ రూ.999లకే మోటో ఇ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను ఆఫర్ ...

news

కేఎఫ్‌సీ నుంచి చికెన్ కాదు.. స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..

కేఎఫ్‌సీలో చికెన్ వెరైటీలను టేస్ట్ చేసి వుంటాం. అయితే కేఎఫ్‌సీ ఇక చికెన్ వెరైటీలతో పాటు ...