గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (12:27 IST)

ట్విట్టర్ మొబైల్ వీడియో కెమెరా ఫీఛర్‌: షారూఖ్ రికార్డు!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలోనూ షారూఖ్ ముందు నిలబడ్డాడు.

తాజాగా 'ట్విట్టర్ మొబైల్ వీడియో కెమెరా' ఫీచర్‌ను ఉపయోగించిన తొలి భారతీయుడిగా షారుక్ మరో అడుగు ముందుకేశాడు. ఈ మేరకు ట్విట్టర్ మార్కెట్ డైరెక్టర్ రిషి జైట్లీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
 
"ట్విట్టర్ ఎప్పుడూ కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంటుంది. అలాగే వారికి నేను చేసిన సూచనలను పరిశీలిస్తామన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ట్విట్టర్ మొబైల్ వీడియో కెమెరా ఫీచర్ చాలా కొత్తగా ఉంది. అప్పుడప్పుడూ దాన్ని ఉపయోగిస్తూ ఎంజాయ్ చేస్తా" అని కింగ్ ఖాన్ పేర్కొన్నారు.