Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాట్స్ యాప్ కొత్త ఫీచర్ ఏంటో తెలుసా?

బుధవారం, 10 జనవరి 2018 (16:01 IST)

Widgets Magazine

వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులు ఇప్పుడు వాట్సప్‌‌లో వాయిస్ కాల్ నుండి వీడియో కాల్‌కి, వీడియో కాల్ నుండి వాయిస్ కాల్‌కి సులభంగా మారే విధంగా ఫీచర్‌లు తయారయ్యాయి. వాట్సప్‌ని సొంతం చేసుకున్న ఫేస్బుక్ కొన్ని నెలల క్రితం నుండే ఈ ఫీచర్‌ని పరీక్షించడం మొదలు పెట్టింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం వల్ల వాట్సప్ వినియోగదారులు వారి సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంచనా ప్రకారం ప్రపంచంలో ఉన్న వినియోగదారులందరికీ ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
 
వాట్సప్‌లో ఈ ఫీచర్ పనిచేసే తీరును పరిశీలిస్తే, దానిలో నూతనంగా ఒక బటన్‌ని పరిచయం చేశారు. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న వాట్సప్‌లో మీరు సాధారణంగా వాయిస్ కాల్ నుండి వీడియా కాల్‌కి మారాలంటే మీరు వాయిస్ కాల్‌ని రద్దు చేసి ఆ తర్వాత వీడియో కాల్ చేయాల్సి ఉంటుంది కానీ వాట్సప్‌లో ఈ బటన్‌ని ప్రవేశపెట్టడం వల్ల మీరు వాయిస్ కాల్ చేస్తున్నప్పటికీ దానిని నొక్కడం వల్ల వీడియో కాల్‌కి ప్రత్యక్షంగా మారవచ్చు. 
 
ఆ బటన్‌ని నొక్కడం వల్ల ముందుగా మీ వాట్సప్ స్నేహితునికి రిక్వెస్ట్ పంపబడుతుంది. ఆ రిక్వెస్ట్‌ని అతను ఆమోదించినట్లయితే మీ మార్గం సుగమమం అవుతుంది. ఈ ఐకాన్ మామూలుగా మీరు కాల్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతుంది. స్వీకర్త కాల్‌ని ఆమోదించక పోతే మీరు ఉన్న ప్రస్తుత కాల్ కొనసాగుతుంది. కొంత ఆలస్యం అయినప్పటికీ వాట్సప్ మంచి నిర్ణయమే తీసుకుంది. కాకపోతే iOS వినియోగదారులకు ఈ ఫీచర్ త్వరలో అప్‌గ్రేడ్ అవుతుందో లేదో తెలియడంలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియో సంక్రాంతి ఆఫర్.. రోజుకు 5జీబీ డేటా

రిలయన్స్ జియో మరో రెండు కొత్త ఆఫర్లను ప్రకటించింది. సంక్రాంతి ఆఫర్‌ కింద వీటిని తాజాగా ...

news

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది...

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది... ఈ మాట వినేందుకు ...

news

నోకియా 6 ఫీచర్స్ లీక్... 4 జీబీ ర్యామ్ - హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌... ఇంకా...

ప్రముఖ మొబైల్ మేకింగ్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ త్వరలో నోకియా 6 పేరుతో ఓ ...

news

జియో ఫీచర్ ఫోన్ ఇక.. అమేజాన్‌లో..

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం ఫీచర్ ఫోన్‌లను అమ్మకానికి ...

Widgets Magazine