వాట్సాప్‌లో ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్.. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (10:53 IST)

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ "ఇన్‌‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్" ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా వినియోగదారులు డబ్బును పంపుకునే వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. వాట్సాప్ పేమెంట్స్‌ను ఉపయోగించుకోవాలంటే... 'వాట్స్ యాప్ పేమెంట్స్ అండ్ బ్యాంక్ టెర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ'ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే, 'ఇన్ స్టంట్ మనీ ట్రాన్స్ ఫర్' ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఇదిలా ఉంటే.. రిలయన్స్ జియోకు చెందిన 4జీ ఫీచర్ ఫోన్. త్వరలో వినియోగదారులకు లభ్యం కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల చివరి వారంలో ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ నెలలో యూజర్లకు ఈ ఫోన్లు లభించనున్నాయి. జియో 4జీ ఫీచర్ ఫోనులో వాట్సాప్‌ను ఎలాగైనా అందుబాటులోకి తేవాలని జియో నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జియో ప్రతినిధులు వాట్సాప్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. జియో 4జీ ఫీచర్ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ వెర్షన్‌ను క్రియేట్ చేసేందుకు గాను జియో వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సమాచారం దీనిపై మరింత చదవండి :  
Whatsapp Facebook Feature Payment Instant Money Transfer Jio Feature Phone

Loading comments ...

ఐటీ

news

యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ వీడియో ట్యాబ్ 'వాచ్'

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన వినియోగదార్ల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇది ...

news

షియోమి నుంచి ఎంఐ 5 ఎక్స్.. ధర రూ.14,200 సెప్టెంబరులో మార్కెట్లోకి..

భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ...

news

యూట్యూబ్‌‌లో కొత్త ఫీచర్.. యాప్ ద్వారా వీడియోలు పంచుకోవచ్చు

యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లోనే ఇతరులతో ...

news

స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్‌ ధరలో మరో స్మార్ట్ ఫోన్...

స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్‌లో ధరలో మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఎలైట్ వీఆర్ పేరిట ...