Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్‌: వందరెట్ల వేగంతో వైఫై

హైదరాబాద్, సోమవారం, 20 మార్చి 2017 (07:21 IST)

Widgets Magazine

సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అంటే జనం పిచ్చివాళ్లను చూసినట్లు చూస్తారేమో కానీ ఇది ఇప్పుడు
WiFi facility
నిజం కాబోతోంది. వైఫై వేగానికి సరిహద్దులు లేకుండా పోతున్న సాంకేతిక ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు. ప్రస్తుత వైఫై వేగం కంటే వందరెట్ల వేగం గల సరికొత్త వైఫై వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఎటువంటి ప్రమాదంలేని పరారుణ కిరణాలను ఉపయోగించారు. దీనితో ఇప్పటికంటే ఎక్కువ పరికరాలకు నిరంతరాయంగా అత్యధిక వేగంతో వైఫై సౌకర్యం కల్పించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
 
ఈ అతివేగపు వైఫై వ్యవస్థను నెదర్లాండ్స్‌లోని ఇండ్హోవెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. దీని ద్వారా సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న అన్ని పరికరాలకూ ఒక్కోదానికి ఒక్కో పరారుణ కాంతికిరణం కనెక్ట్‌ అయి ఉండటం వల్ల ఎన్ని పరికరాలను వైఫైకి అనుసంధానం చేసినా ఏమాత్రం వేగం తగ్గకుండా అన్నిటికీ అదే వేగంతో డేటా సరఫరా అవుతుంది.
 
ఈ అతివేగపు భారత్‌కు ఎప్బడొస్తుందన్నదే అసలు ప్రశ్న. మన ఇంటర్నెట్ ఎంతగా చించుకున్నా 1 ఎంబీ స్పీడ్‌కు మించి పని చేయడం లేదు మరి... 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై గుడ్ న్యూస్: మార్చి 29న రిలీజ్‌కు సన్నాహాలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై ఓ శుభవార్త. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు శామ్‌సంగ్ ...

news

నిఘా అనేది పెనుముప్పు.. ఇకపై ఫేస్ బుక్ నిబంధనలు కఠినతరం..

ఫేస్ బుక్ నిబంధనలను కఠినతరం చేసింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన ...

news

ఆపిల్ ఈవెంట్.. కొత్త ఐప్యాడ్.. 128 జీబీ స్టోరేజీతో అతిపెద్ద ఐఫోన్ ఎస్

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈ వెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రోను ...

news

గూగుల్‌తో జియో ఒప్పందం... రూ.2 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్లు

ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్‌తో రిలయన్స్ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ...

Widgets Magazine