మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (14:58 IST)

ఇండియాలో డేటింగ్ యాప్స్ లేవు.. ఈ యాప్స్‌కు నో పాపులారిటీ..!

ఇండియాలో డేటింగ్ యాప్స్ లేవని వూ వ్యవస్థాపకుడు సుమేష్ మీనన్ అంటున్నారు. మ్యాచ్ మేకింగ్ సేవలు మాత్రమే ఇండియాలో ఉన్నాయని, డేటింగ్ యాప్స్‌కు అంత పాపులారిటీ లేదని 'వూ' వ్యవస్థాపకుడు సుమేష్ మీనన్, 'వీ' సృష్టికర్త నితిన్ గుప్తా, 'ట్రూలీ మాడ్లీ' రాహుల్ కుమార్ తదితరులు చెబుతున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చేవారు అత్యధికులుగా ఉండటంతో డేటింగ్ యాప్స్ అంతగా ప్రాచుర్యం పొందలేదని వారు అంటున్నారు. 
 
'హుకప్ యాప్', 'టిండర్' తదితర ఎన్నో యాప్స్ స్మార్ట్ ఫోన్లలో డేటింగ్ సేవలను అందిస్తున్న నేపథ్యంలో టిండర్ యాప్ నడిపిస్తున్న విధానం, దాని వెనకున్న ఆలోచన తనకు నచ్చాయని, కానీ వాస్తవానికి ఫలితాలు సరైనవి రావట్లేదని, వీటి వాడకం ద్వారా ఒక వ్యక్తిని కూడా తాను కలుసుకోలేదని ఢిల్లీ న్యాయవాది నుపుర్ యాదవ్ తెలిపారు. తనకు వివాహం చేయాలని భావించిన తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితమే భారత్ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ సృష్టించారని తెలిపిన ఆమె, మూడేళ్ల పాటు వెతికి వారు విఫలమయ్యారని తెలిపారు. 
 
తాను సరైన భాగస్వామి కోసం వెతుకుతుంటే, తాత్కాలిక పరిచయాలు, సంబంధాల కోసం చూస్తున్నవారే అధికంగా ఉన్నారని ఆమె వాపోయారు. అయితే, సంప్రదాయ వివాహ వెబ్ సైట్లతో పోలిస్తే మరిన్ని సేవలను మాత్రం అందిస్తున్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు.