Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫోటోలు చకచకా డౌన్లోడ్ చేస్తున్నారా? ఇమేజ్ గేట్ వైరస్‌తో జాగ్రత్త.. ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ వాడేవారు?

మంగళవారం, 29 నవంబరు 2016 (16:32 IST)

Widgets Magazine

సోషల్ మీడియా ప్రభావం.. చేతిలో స్మార్ట్ ఫోన్లు, ఫ్రీ డేటా ఇంకేముంది.. సినిమాలు, పాటలు, ఫోటోలు చకచకా డౌన్లోడ్ చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఫోటోలు డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఫోటోల ద్వారా వ్యాపించే ఇమేజ్ గేట్ అనే కొత్త వైరస్‌తో తిప్పలు తప్పవని సాంకేతిక నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో ఈ వైరస్ ఈజీగా ప్రవేశిస్తున్నాయని కంప్యూటర్ నిపుణులు అంటున్నారు. సోషల్‌మీడియాలోని కొన్ని లోపాల ఆధారంగా ఈ ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేస్తారు. సోషల్‌మీడియాను వినియోగించేవారు పొరబాటున ఈ ఇమేజ్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే వైరస్‌ సిస్టంలోకి వచ్చేస్తుంది. దీంతో మనం వాడుతున్న సిస్టం కానీ ఇతర పరికరం కానీ వారి ఆధీనంలోకి వెళుతుంది. దీన్ని హ్యాకర్లు సొమ్ము చేసుకునే అవకాశాలున్నట్లు కంప్యూటర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సోషల్‌మీడియాలో ప్రత్యేకించి ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ వాడేవారు జాగ్రత్తగా వుండాలి. ఫోటో ఎక్స్‌టెన్షన్‌ తేడాగా వుంటే డౌన్‌లోడ్‌ చేయవద్దు. ఇంకా ఇతరులు పంపే జెపెగ్‌ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే డౌన్‌లోడ్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్టీఏ, జెఎస్ వంటి వాటిని మెనూలోకి వెళ్లి టూల్స్, ఎక్స్‌‍టెన్షన్ నుంచి తొలగించాలి. ఇలా చేస్తే ఫోటోల ద్వారా సిస్టమ్ ప్లస్ ఫోన్లలోకి ప్రవేశించే వైరస్‌ను కట్టడి చేసేందుకు వీలుంటుందని సైబర్ సెక్యూరిటీ అధికారులు చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియో సూపర్ రికార్డు: రోజుకు సగటున ఆరు లక్షల ఖాతాదారులతో..?

సంచలనాలకు కేంద్రంగా మారిన రిలయన్స్ జియో టెలికాం మరో ఘనతను సాధించింది. ఉచిత కాలింగ్, ఉచిత ...

news

రిలయన్స్ జియో గుడ్ ‌న్యూస్.. 2017 మార్చి వరకు వెల్‌కమ్ ఆఫర్

రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం జియో మొబైల్ ...

news

వాట్సప్‌లో లింకుల్ని షేర్ చేస్తున్నారా? కాస్త ఆగండి గురూ.. హ్యాకర్లున్నారు జాగ్రత్త...

వాట్సప్‌లో గంటల పాటు గడుపుతున్నారా? అలా ఇతరులు షేర్ చేసే లింకుల్ని ఓపెన్ చేయడం.. వాటిని ...

news

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ బిల్లు మాదికాదు... రిలయన్స్ జియో

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న బిల్లు తమ కంపెనీ విడుదల చేసింది కాదనీ రిలయన్స్ జియో ...

Widgets Magazine