గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2014 (18:31 IST)

పిల్లలకు దెబ్బ తగిలితే బ్యాండ్ ఎయిడ్ వేస్తున్నారా?

పిల్లలకు దెబ్బ తగిలితే బ్యాండ్ ఎయిడ్ వేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. పిల్లలకు దెబ్బ తగిలినా, మరేదైనా గాయమైనా వెంటనే బ్యాండ్ ఎయిడ్ వేసేస్తాం. కానీ దానిని తొలగించడం చిన్న పనికాదు. 
 
కొత్త బ్యాండ్ ఎయిడ్ గాయంపై వేసి ఆరిన తర్వాత ఒక్కసారిగా లాగినట్లు తీసేస్తే పిల్లలు ఆ నొప్పిని భరించలేరు. కాబట్టి బ్యాండ్ ఎయిడ్‌ను తీసేముందు బ్యాండ్ ఎయిడ్ చివరల బేబీ ఆయిల్ లేదా మరేదైనా నూనె కానీ రాయాలి. అప్పుడు అంచులు మెల్లగా చర్మాన్ని వదులుతాయి. మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగా వదులు చేస్తూ పూర్తిగా తీయాలి, 
 
* పిల్లల పాల సీసాలు, మందులు వేసే స్పూన్లు వాసన లేకుండా శుభ్రపడాలంటే సోడాబైరకార్బనేట్ కలిపిన వేడి నీటితో రాత్రంతా ఉంచి ఉదయాన్నే బ్రష్‌తో రుద్ది శుభ్రం చేయాలి. సీసాలను మరిగించేటప్పుడు కూడా నీటిలో ఒక స్పూన్ సోడాబైకార్బనేట్ కలిపితే సీసాలకు పట్టేసిన పాల వాసన పోతుంది.