శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (15:42 IST)

బ్రిటన్‌లోనూ ఆడపిల్లలపై వివక్ష.. అబ్బాయిలకు పాకెట్ మనీ ఎక్కువ.. అమ్మాయిలకు తక్కువ!

అమ్మాయిలంటే స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వివక్ష ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా చిన్న పిల్లలకు ఖర్చుల కోసం పాకెట్ మనీ ఇస్తుండటం చూస్తుంటాం. కానీ బ్రిటన్ లాంటి అభివృద్ధి దేశంలో కూడా ఆడపిల్లలపై వివక్ష పెరిగిపోతుంది. 
 
తాజాగా తల్లిదండ్రులు పిల్లలకోసం ఇస్తున్న పాక్‌మనీ ఎంత  అనే దానిపై ఓ బ్యాంకు నిర్వహించిన సర్వేలో తేలిందేమిటంటే .. 8 నుంచి 15 ఏళ్ళ వయస్సు లోపల అబ్బాయిలకు వారానికి సుమారు రూ.640 వరకూ పాకెట్ మనీ పొందుతుండగా... అదే వయసులోని బాలికలు మాత్రం రూ.597 మాత్రమే పొందుతున్నారట.
 
1,202 మంది పిల్లలు, 575 మంది తల్లిదండ్రులపై చేపట్టిన సర్వేల ప్రకారం.. బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రుల నుంచి సగటున వారానికి 6.55 పౌండ్లో అంటే సుమారు రూ.640 పాకెట్ మనీగా పొందుతున్నట్లు తెలిసింది. అయితే ఆడపిల్లలు మాత్రం 12 శాతం తక్కువ డబ్బును పాకెట్ మనీగా పొందుతున్నట్లు హాలిఫాక్స్ బ్యాంకు ప్రచురించిన అధ్యయనాల్లో తేలింది.