శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 జూన్ 2015 (17:38 IST)

అనుక్షణం పిల్లల వెంటపడి ఏదోకటి చెప్తున్నారా?

అనుక్షణం వెంటపడి ఏదోకటి చెప్తున్నారా? అయితే ఇకపై ఇలా చేయకండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలు చేసే ప్రతి పనిని గమనిస్తూ దానిని విమర్శిస్తూ.. ఏదో ఒకటి చెప్పుకుంటూ వుండటం మంచిది కాదని వారు సూచిస్తున్నారు. వారిని కాస్త స్వేచ్ఛగా వదలాలి. వారిని ఆలోచింపజేయాలి. 
 
అలాగే టీవీ ఛానల్స్ అన్నీ ఓపెన్ అయ్యే మాదిరి చూడాలి. అంశానికి సంబంధించి సమాచారం అందించాలి. కాని డిక్టేట్ చేయడం, విమర్శించడం కూడదు. అనుక్షణం వారి వెంటపడి ఏదోకటి చెప్తుంటే పని జరగదు. వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తారో ముందుగా వినాలి. 
 
కొందరు పిల్లలు అభ్యసించడాన్ని ఇట్టే నేర్చుకుంటారు. ఇంకొందరు అలా నేర్చుకోలేకపోతారు. అంతమాత్రాన వారు పనికిరారని అర్థంకాదు. వారిలో అభ్యసించే లక్షణాన్ని పెంపొందించడానికి అటు టీచర్లు, ఇటీ పేరెంట్స్ తమవంతు కృషి చేయాలి. పిల్లల అభ్యాసం, అభ్యాస వైఫల్యాల్ని ఎదుర్కొనే విషయంలో ఇంట్లో పెద్దలు సున్నితమైన విధానాలను అనుసరించాల్సి వుంటుంది. 
 
చదువులో వైఫల్యాన్ని చవిచూసినా, తానా కుటుంబానికి చెందినవాడనే అన్న భద్రతాభావం వారిలో నింపాలి. పెద్దల అంచనాల మేరకు మార్కులు పొందలేకపోయినా కుటుంబానికి దూరమైన భావాన్ని పెరిగే దిశగా వారిలో అభద్రతా భావాలు కలిగేలా ప్రవర్తించకూడదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
ఫలితాలెలా ఉన్నా పిల్లల్ని ప్రేమిస్తున్నానని, అయితే తన సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించడంలేదని బాధపడుతున్నట్లు వివరించాలి. ఈ భరోసావల్ల వారిలో అబద్ధాలు చెప్పే గుణం తగ్గుతుంది. ప్రోగెస్ కార్డుల్లో మార్కుల్ని మార్చే ప్రయత్నాలు చెయ్యరు. పరీక్షల్లో కాపీలు కొట్టరు. ప్రొగ్రెస్ రిపోర్ట్ కార్డులపై సంతకాల ఫోర్జరీ అంతకంటే చెయ్యరు. ఇతరత్రా తప్పులకు ఆస్కారం ఉండదు.