శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (18:34 IST)

పిల్లల్లో దాగుండే ప్రతిభను ఎలా గుర్తించి వెలికితీయాలి?

పిల్లలకు పదేళ్ల వయస్సు వచ్చేసరికి వారిలో ఉండే ఆసక్తులు బయటపడతాయి. వారితో కలిసి కొంత సమయాన్ని గడుపుతుంటే వారిలోని ఆసక్తుల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. పిల్లల్లో చాలాభాగం ఏదో ఒక ప్రతిభ తప్పనిసరిగా దాగి వుంటుంది. దాన్ని గుర్తిస్తే, ఆ దిశగా వారిని ప్రోత్సహించడం సులభమవుతుంది.
 
ఒక్కసారి వారిలోని ప్రతిభను గుర్తించాక ఆ దిశగా వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించే ప్రయత్నాలు చేయాలి. సంగీతం, డ్యాన్స్, ఆటలు, పెయింటింగ్- ఇలా ఏదైనా సరే.. అందులో శిక్షణ అవసరం. 
 
హాబీవల్ల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని ఏ సంద్భంలోనూ వారిని నిరుత్సాహపరచకూడదు. దేనికి ఎంత సమయం కేటాయించాలో, ఒకదానివల్ల మరొకటి నిర్లక్ష్యానికి గురికాకుండా ఎలా సమర్థించుకోవాలో వారికి నేర్పించాలి. 
 
అవసరమైన సహకారమివ్వాలి. ఎన్నుకున్నదానిలో నైపుణ్యం సాధించడానికి అవసరమైన వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. పిల్లల్లోని ప్రతిభాపాటవాలు రాణించాలంటే చిన్నతనంలో తగిన సహకారం లభిస్తేనే సాధ్యపడుతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.