శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (16:48 IST)

పిల్లలకు పౌష్టికాహారం ఓకే.. వ్యాయామం చేయిస్తున్నారా?

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్లకు పోషకాహారాన్ని అందివ్వడమే కాదు.. వ్యాయామం చేసేలా కూడా ప్రోత్సహించాలి. అయితే దానికీ కొన్ని కిటుకులున్నాయి. భోజనం అయ్యాక మంచమెక్కేయడం.. టీవీ ముందు కూర్చోకుండా పిల్లలతో కలిసి కాసేపు బయట నడవండి. 
 
సాధ్యమైనంత వరకూ ఆ సమయంలో చదువూ, లక్ష్యాల గురించి మాట్లడటం మొదలు పెడితే వారికి ఆసక్తి తగ్గిపోవచ్చు. అందుకే కాసేపు సరదాగా నడవాలి. 
 
పరుగెత్తినా, వేగంగా నడిచినా, కండరాలను బలోపేతం చేసే పుషప్స్, ఎముకల్ని దృఢంగా ఉంచే తాడాట ఆడటం వంటివన్నీ కలిపి మొత్తం గంట వ్యాయామం చేసేలా చూడాలి. అయితే ఇది ఒకేసారి కాకుండా రోజులో కుదిరినప్పుడల్లా చేసేలా ప్రోత్సహించాలి. 
 
శారీరక శ్రమ అనేది పోటీ తరహాలో ఉండకూడదు. అలాగే ప్రత్యేకమైన పరికరాలూ ఉండాలని లేదు. తాడూ, బంతి, సైకిల్ వంటివి అందుబాటులో ఉంచితే చాలు. వాటి చేతే వ్యాయామం చేయించవచ్చు. 
 
వ్యాయామాన్ని ఇంట్లో చేయమంటే పిల్లలు బద్దకించవచ్చు. అందుకే దగ్గర్లోని పార్కుకి తీసుకెళ్లండి. వ్యాయామంలో ఆటలు కూడా మేళవిస్తేనే పిల్లలు ఉత్సాహంగా చేస్తారు. కాబట్టి సరదాగా, ఆడుతూపాడుతూనే వారిచేత వ్యాయామం చేయించాలి.
 
పిల్లలకి క్రీడలపై ఆసక్తి ఉంటే ఆ దిశగానూ ప్రోత్సహించాలి. వ్యాయామంతో పాటు వాళ్లకొక విద్య కూడా వచ్చినట్లవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.