మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జనవరి 2015 (17:12 IST)

పుట్టబోయే పిల్లల్లో నాడీ సంబంధ లోపాలకు..?

పుట్టబోయే పిల్లల్లో నాడీ సంబంధ లోపాలు తలెత్తకుండా ఉండాలంటే  ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఉపయోగపడతాయని పరిశోధకులు తేల్చారు. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం గర్భం దాల్చే మహిళలు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. 
 
తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదాన్ని ఫోలిక్ యాసిడ్ తగ్గిస్తుందని వెల్లడైంది. తక్కువ బరువుతో పుట్టే పిల్లల్లో డయాబెటిస్, అధిక రక్తపోటు, ఒబిసిటీ, హృద్రోగాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా పొంచి వుంది. 
 
అందుకే గర్భం దాల్చే మహిళలు తప్పనిసరిగా ఫోలిక్‌యాసిడ్ సప్లిమెంట్స్‌ తీసుకోవడం వల్ల పిల్లలు హెల్దీగా పుడతారని పరిశోధకులు తేల్చారు.