మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జూన్ 2014 (18:31 IST)

దోర జామపండును రోజూ తింటే ఏమవుతుంది?

దోర జామపండు ప్రతి రోజు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బాగా మాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.  
 
* ఉదయం-రాత్రిపూట భోజనానంతరం జామపండు తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది.
 
* గుండెజబ్బున్నవాళ్ళు ప్రతి రోజు భోజనంతోపాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తీసుకుంటుంటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.   
 
* జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే దూరమౌతాయంటున్నారు వైద్యులు.