బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (12:33 IST)

వేసవికాలంలో పిల్లలకు కూల్‌డ్రింక్సే వద్దు.. తాజా పండ్లే ముద్దు!

వేసవికాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. వేసవిలో నీరసం, అలసట అందరినీ ఆవహిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో అలసట చాలా ఎక్కువగా కనిపిస్తుంది. స్పృహ తప్పి పడిపోవడం.. అలసటకు డీహైడ్రేషన్ కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే వేసవిలో పిల్లలను ఎండల్లో తిరగనివ్వకూడదు. ఆడుకోనివ్వడం, వర్కౌట్లు చేయడం ద్వారా పిల్లల్లో డీహైడ్రేషన్ తప్పదు.
 
సాధారణంగా వ్యాయామం చేసేటప్పుడు, ఆడుకునేటప్పుడు పిల్లలకు చెమటలు పట్టడం సాధారణం. అదే వేసవిలో అయితే చెమటలెక్కువ పడతాయి. తద్వారా నీరసం తప్పదు. అలాగే తక్కువ ఎత్తుతో కూడిన ఇళ్ళను నిర్మించడం.. సిమెంట్ షీట్ల పైకప్పుల ద్వారా వేసవి తాపం అధికమవుతుంది. అలాంటి గాలి లేని గదుల్లోనే పిల్లల్ని ఉంచడం ద్వారా నీరసం, అలసట ఏర్పడుతుంది. 
 
అందుచేత గాలి, వెలుతురు వచ్చే గదుల్లో పిల్లలు ఉండేలా చూసుకోవాలి. తేలికగా ఉప్పు కలిపిన నీటిని తీసుకునేలా చేయాలి. జ్వరాలను నిర్లక్ష్యం చేయకూడదు. గాయాల పట్ల జాగ్రత్త వహించాలి. నువ్వుల నూనెతో పిల్లలకు మర్దన చేయించి.. తలస్నానం చేయించడం ద్వారా ఉష్ణాన్ని నియంత్రించవచ్చు. 
 
పెసరపప్పు, పసుపు కలిపి స్నానానికి ముందు ఒళ్లంతా రాసి ఆపై స్నానం చేయించడం ద్వారా చెమటకాయల్ని నివారించవచ్చు. అలాగే దుకాణాల్లో అమ్మే కూల్ డ్రింక్స్ పిల్లలకు తాగించకుండా ఇంట్లోనే చేసే ఫ్రెష్ జ్యూస్‌లను పిల్లలకు తాగిస్తే మంచిది. జ్యూస్ లాగానే కాకుండా పండ్లను అలాగే తినడం మంచిది. రాగి జావ, ఆపిల్స్, ఆరెంజ్ పండ్ల, మజ్జిగ వంటివి పిల్లలకు ఇస్తుండాలి.