శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2015 (18:21 IST)

పిల్లలు అహంకారంతో ప్రవర్తిస్తే వెంటనే స్పందించండి..!

పిల్లలు అహంకారంతో ప్రవర్తిస్తే తల్లిదండ్రులు వెంటనే స్పందించండి..! అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లల ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు.. పిల్లవాడి పట్ల ఏదో తప్పు జరిగిందన్నా విషయాన్ని వెంటనే గ్రహించాల్సిన అవసరముంది. మీ బిడ్డ మీతో అహంకారంతో ప్రవర్తిస్తే, మీకు వారిపై అధికారం ఉందని దగ్గరిగా తీసుకోవాలి అదేసమయంలో, బెదిరించినట్లుగా మీ శరీర నడవడిక ఉండాలి. 
 
అహంకారంగా ప్రవర్తించే పిల్లల పట్ల ఎలా నడుచుకోవాలంటే..? ఏదైనా విషయంపై కలత చెందడం సరే, కానీ గట్టిగా ఏడ్చి, పెద్దగా అరిచి తెలియచేయల్సిన అవసరం లేదని మీ పిల్లలకు చెప్పాలి. మానసిక స్థైర్యం పోగొట్టుకోవడం సహజం కానీ అది ఆ సమతౌల్యత ఒకసారి ఎంత త్వరగా తిరిగి పొందగలుగుతామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇదే విషయం పిల్లలకు బోధించడం ముఖ్యం.
 
పిల్లలు తలిదండ్రుల వద్ద ఏ విషయమైనా స్వేచ్ఛగా తెలియజేసేందుకు వీలుకల్పంచాలి. ఎప్పుడూ స్ట్రిట్‌గా ఉండకూడదు. సరైన సమయంలో కమ్యూనికేషన్ జరిగితే, ఎన్ని లోపాలున్నా మీ అనుబంధం చెడిపోయే ప్రమాదం ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.