గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (18:00 IST)

పిల్లల ముందే పోట్లాడుకుంటున్నారా.. జాగ్రత్త సుమా!

భార్యాభర్తలు పిల్లల ముందే పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త సుమా అంటున్నారు సైకాలజిస్టులు. తల్లిదండ్రులు పోట్లాట పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. వారి ముందే ఫైటింగ్‌ చేస్తే ఒత్తిడికి గురవుతారు. 
 
పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లితండ్రులను రోల్ మోడల్‌గా భావిస్తారు. వారు మంచి చెడు విషయాలు రెండింటిని అనుకరిస్తారు. కొన్ని పరిస్థితుల్లో మీకు మీ భాగస్వామి మధ్య తగాదాలు ఉండటం అనేది సహజమే. ఆ సమయంలో మీ చుట్టూ మీ పిల్లలు లేకపోతే మంచిది. 
 
ఒకవేళ పిల్లలుంటే వారి ముందు పోట్లాడుకోవడం చాలావరకు తగ్గించండి కుదరని పక్షంలో  వారిని దూరంగా ఉంచండి. న్యాయమైన విషయంపై పోట్లాడుకోండి. కోపంగా ఉన్నప్పుడు దూషణలు నివారించండి. పేరు పెట్టి పిలవటం లేదా ఇతర అసంబద్ధ భాష ఉపయోగించటం నివారించవలసి ఉంది.
 
పిల్లల ముందు కొట్టుకోవడం ఎట్టిపరిస్థితుల్లో చేయకండి. ఇలా చేయడం ద్వారా పిల్లలు జడుసుకుంటారు. తద్వారా పిల్లల్లో సంఘవిద్రోహ ప్రవర్తనలు ఏర్పడతాయి. భాగస్వామిపై చేయిచేసుకోవడం నివారించాలి. పిల్లల ముందు హింసాత్మకంగా ప్రవర్తించకూడదు.
 
అలాగే పిల్లల ముందు ఇతరుల మీద ఆరోపణలు చేయవద్దు. ముఖ్యంగా మీ భాగస్వామి తల్లితండ్రుల మీద ఆరోపణలు చేయకూడదు. మీ పిల్లలు పెరుగుతున్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 
 
ఇంకా పిల్లలు గురించి ఎలాంటి విషయాలను చర్చించడం నివారించాలి. పిల్లల ముందు పోట్లాట ద్వారా మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్లవుతుంది. అందుచేత ఎలాంటి సమస్యలనైనా సామరస్యంగా హుందాగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.