శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (17:21 IST)

టీనేజర్లకు ఇంటర్నెట్‌తో ముప్పే.. వారానికి 14 గంటలకు మించి వాడితే?

నాగరికత పెరిగిపోయిన నేపథ్యంలో మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ల వాడకం ఎక్కువైపోతుంది. వీటిని వాడాలంటే ఇంటర్నెట్ కూడా తప్పనిసరి అయ్యింది. ముఖ్యంగా టీనేజర్లు ఇంటర్నెట్ నెట్ వినియోగంలో బాగా ఆసక్తి చూపుతుంది. అయితే ఇంటర్నెట్ వినియోగంతో టీనేజర్లకు ముప్పు పొంచివుందని తాజా అధ్యయనంలో తేల్చింది. టీనేజర్లు ఇంటర్నెట్ వినియోగంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని న్యూయార్క్‌కు చెందిన ఓ అధ్యయనం తేల్చింది. 
 
అది కూడా వారంలో 14 గంటలకు మించి ఇంటర్నెట్ వాడకూడదని.. ఒకవేళ 14 గంటలకు మించి నెట్ వాడితే స్థూలకాయం, బీపీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకా వారానికి 25 గంటలకు మించి ఇంటర్నెట్ ఉపయోగిస్తే వారి ఆరోగ్యం మరింతెక్కువగా దెబ్బతింటుందని హెన్రీఫోర్డ్ ఆసుపత్రి వైద్యుడు ఆండ్రియా కాస్సిడి తెలిపారు. బ్రౌజింగ్ ఎక్కువ చేసేవారిలో 43 శాతం మంది అధిక బరువున్నారని పరిశోధకులు వెల్లడించారు.