గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (13:22 IST)

పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా..?

చిన్నప్పుడు ఏం కావాలంటే అది తెచ్చిస్తారు సరే! అదే ఎదిగే కొద్దీ ఆ కోరికల జాబితా ఖరీదుతో కూడుకున్నది కావచ్చు. అందుకే ఊహతెలిసినప్పటి నుంచే పిల్లలకు డబ్బు విలువ తెలపాలి. పొదుపు అలవాటు చేయాలి. దాని కోసం మీరేం చేయవచ్చంటే.. 
 
అమ్మమ్మా, తాతయ్యలు, బంధువులు ఇచ్చే చిన్న చిన్న మొత్తాన్ని ఖర్చు పెట్టేయకుండా చూసుకోండి. ఓ కిడ్డీ బ్యాంకు కొనివ్వండి. తేదీ, పోగయిన మొత్తం డబ్బుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండమనండి. వాటిలో ఎప్పుడైనా డబ్బులు తీయాల్సి వస్తే ఆ ఖర్చునూ రాయమనండి. దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అలవడుతుంది. 
 
 పిల్లలు ఇచ్చిన డబ్బును అలాగే ఖర్చు పెట్టేస్తే కాస్త కఠినంగా వ్యవహరించాలి. మరీ ముఖ్యమైన అవసరమైతే నెల మధ్య కొంత డబ్బు ఇస్తే, వచ్చే నెల పాక్ మనీ నుంచి మినహాయించండి. దీనివల్ల వారిలో క్రమశిక్షణ అలవడుతుంది. పాకెట్ మనీని దుర్వినియోగం చేయకుండా చూడండి. అందుచేత కచ్చితంగా ఖర్చుపెట్టేలా చూసుకోండి. అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.