బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (13:16 IST)

క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని కొట్టారో.. తల్లిదండ్రుల పనైపోతుంది..! కొత్త చట్టం వస్తుందా?

భారత్‌లోనూ క్రమశిక్షణ పేరుతో పిల్లలను కొట్టడం చేస్తే తల్లిదండ్రులకు శిక్షలు తప్పేట్లు లేవు. చిన్నారుల సంరక్షణ, వారి హక్కులను కాపాడే దిశగా భారత్‌లో ఓ కొత్త చట్టం రూపుదిద్దుకుంటోంది. ప్రతిపాదిత చట్టంలో విద్యార్థులు, చిన్నారుల సంరక్షణకు ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం తమ పిల్లలు కొట్టిన తల్లిదండ్రులకు శిక్షలు తప్పవు. క్రమశిక్షణ పేరుతో పిల్లలపై చేజేసుకోవడాన్ని ఆ చట్టం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 
 
తొలిసారిగా నేరం చేస్తే ఆరు నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలు విధిస్తారు. ఇక రెండోసారి పిల్లలను కొట్టి పట్టుబడితే, మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల వరకూ జరిమానా, అదే వ్యక్తి మూడవ సారి పట్టుబడితే, ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. 
 
ఇక చిన్నారులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తే.. ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం మారుతోంది. అయితే పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా వారు చేస్తున్న పనుల్ని సమర్థించుకుని పోతే మారుతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.