బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 నవంబరు 2014 (15:07 IST)

ఎదుగుతున్న ఆడపిల్లలపై ఆంక్షలొద్దు.. అనునయం అవసరం!

పాఠశాలకు లేదా కళాశాలకి వెళ్ళనని మీ అమ్మాయి తరచూ మారాం చేస్తోందా? అయితే కోపపడకుండా ఆంక్షలు విధించకుండా అనునయంతో వారి సమస్యలను అడిగి తెలుసుకోండి అంటున్నారు సైకాలజిస్టులు. 
 
పాఠశాల, కళాశాలల్లో అమ్మాయికి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయా అని అనునయంగా మాట్లాడి తెలుసుకోవాలి. అది చదువుకు సంబంధించినదైనా.. వ్యక్తిగతమైనా కావచ్చు ఏవైనా పారెంట్స్ వారితో ఓపిగ్గా మాట్లాడి తెలుసుకోవాలి.
 
ఎదుగుతున్న ఆడపిల్లలపై చాలామంది తల్లిదండ్రులు అకస్మాత్తుగా ఆంక్షలు పెడుతుంటారు. అప్పటివరకు ఏ హద్దుల్లేని అమ్మాయి ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పులను చూసి తనకు ప్రతికూలంగా మారిపోతున్నారనుకునే ప్రమాదం ఉంది. 
 
దాంతో తనను తాను ఒంటరిగా భావిస్తుంది. వారి దగ్గర అన్నీ దాచిపెట్టాలనుకుంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ అమ్మాయితో ఎప్పుడూ ఓ మంచి స్నేహితురాలిలా ఉండేందుకు ప్రయత్నించండి. వారి సమస్యలకు పరిష్కారాలు చెప్పాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.