శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2014 (15:58 IST)

టీనేజ్ పిల్లలతో జాగ్రత్త సుమా!

అమ్మో.. పిల్లల సంరక్షణలో ఈ ట్రెండ్‌కు చెందిన పారెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆధునిక పోకడలు పిల్లల పెరుగుదలపై బాగా ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలకు తగ్గట్టు పారెంట్స్ నడుచుకోవాలి. 
 
ముఖ్యంగా టీనేజ్‌లో తల్లిదండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. తమకే కట్టుబడి ఉండాలనే ఆలోచన టీనేజ్ పిల్లలపై తల్లిదండ్రులు రుద్దకండి. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను ఇతరులతో అనవసర పోలికలు తెస్తూ ఉంటారు. 
 
ఇతర పిల్లలతో పిల్లలను పోల్చడం వలన, పిల్లల దృష్టిలో పేరెంట్స్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కౌమార దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా, తల్లిదండ్రులు వారి పిల్లలు మీద ఒత్తిడి ఎప్పుడూ ఉండకూడదు. అనవసరంగా అనుమానించకూడదు.. అవమానించకూడదని మానసిక నిపుణులు అంటున్నారు.