బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 25 జనవరి 2016 (09:38 IST)

ఎంత బిజీగా ఉన్నా.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి....

ఇప్పుడున్న ఆధునిక కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరూ ఉద్యోగాలు చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తమ పిల్లలు ఏం చేస్తున్నారో.. ఎలా పెరుగుతున్నారో.. పట్టించుకోవాల్సిన బాధ్యతను మాత్రం మర్చిపోతున్నారు.
 
ఈ ప్రపంచంలో అన్నీ డబ్బుతో కొనలేమనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఒకటి స్నేహం, మరొకటి ప్రేమ ఇవి రెండూ.. పిల్లలకు అందించాలి. మీ పిల్లల కోసం వీలైనంత సమయాన్ని కేటాయించండి. ఎక్కువమంది చిన్నపిల్లలు స్పర్శ ద్వారా ప్రేమను అనుభవిస్తారు. అది వారి కోరిక. 
పెద్దవాళ్ళయ్యాక అలా తండ్రితోగానీ, తల్లితోగానీ వుండేందుకు సిగ్గు పడవచ్చు. 
 
అందుచేత పిల్లలు స్పర్శ ద్వారానే తల్లిదండ్రులను, ఇతరులను గుర్తిస్తారని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమగా పడుకోవడానికి, హత్తుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు. అందుకే వారి పక్కనే పడుకుని నిద్రించడానికి గల అవకాశాలన్నీ చక్కగా వినియోగించాలి.
 
మంచి చెడుల గురించి తెలియజేయడం. సమాజంలో ఎలా జీవించాలో.. ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలో వివరంగా చెప్పండి. పిల్లలకు తల్లితండ్రులు తమను పట్టించుకోవడం లేదనే భావన కలగకుండా.. మీ తీరిక సమయాన్ని వారి కోసం కేటాయించండి.
 
గుండెలకు హత్తుకున్నా, ముద్దులాడినా లేదా పరస్పర గిలిగింతలకు పిల్లలు ఇష్టపడతారు. తప్పు చేస్తే అనవసరంగా కొట్టడం, తిట్టడం వంటి పనుల వల్ల పిల్లలు నొచ్చుకుంటారు. తల్లిదండ్రుల మీద ప్రేమగా పడుకోవడానికి, హత్తుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు. అందుకే వారి పక్కనే పడుకుని నిద్రించడానికి గల అవకాశాలన్నీ చక్కగా వినియోగించాలి.