గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 మే 2015 (17:14 IST)

కార్న్‌ఫ్లేక్స్, వేఫర్స్, సాల్ వద్దు.. పిల్లల్లో బీపీ పెరిగిపోద్దట!

వయసు పెరిగిన తర్వాతే బ్లడ్ ప్రెషర్ పెరిగి అధిక రక్తపోటు వస్తుందనే అభిప్రాయం క్రమంగా మార్చుకోవాల్సి వస్తున్నది. పిల్లల ఆహారపు అలవాట్లు మారడంతో వారు తింటున్న ఉప్పు పరిమాణం క్రమంగా పెరుగుతున్నది. ఇంటి దగ్గర తయారుచేసి అందించే ఆహార పదార్థాల మీద పిల్లలకు ఇష్టం తగ్గిపోతుంది.

షాపుల్లో దొరికే కార్న్‌ఫ్లేక్స్, వేఫర్స్, బిస్కెట్లు, ఊరగాయ పచ్చళ్ళు అధికంగా తింటున్నారు. వీటిలో కలిసే రసాయనాలు, ఉప్పు అధికంగా వుండి దాని ప్రభావంతో చిన్న వయసులోనే రక్తపోటు వస్తోందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
 
ఆరేళ్ళ పిల్లలకు రోజుకు 3 గ్రాముల ఉప్పుకన్నా ఎక్కువ అనవసరం. ప్రస్తుతం పిల్లలు తినే వారి తీరు చూస్తుంటే.. వారికి ఒక గ్రామే సరిపోతుంది. ఇంకా తాజా పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాలు, తృణధాన్యాలు, లో-ఫ్యాట్ డైరీ ఫుడ్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు