శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 మే 2015 (18:06 IST)

మండే ఎండలు.. పిల్లలకు నీరు తాగించండి.. లేకుంటే..?

శరీరంలో అవసరమైన నీటి పరిమాణంకన్నా తక్కువగా నీరు వుండటాన్ని నిర్జలీకరణం అంటారు. శరీరంలోని జీవకణాలు సక్రమంగా పనిచేయాలంటే నీరు అత్యావశ్యకం. ఆక్సిజన్ తర్వాత శరీరానికి ముఖ్యంగా కావలసినది నీరు. అదీ వేసవిలో పిల్లలకు, వృద్ధుల్లో నీటిశాతం తక్కువగా ఉంటుంది. తద్వారా పిల్లలు, వృద్ధులు సులభంగా వడదెబ్బకు గురవుతారు. వడదెబ్బ బారి నుంచి పిల్లలను రక్షించాలంటే.. నీరా బాగా తాగించాలి. 
 
నీటిలో కాసింత ఉప్పు, పంచదార కలపాలి. లేత కొబ్బరి నీరు, మజ్జిగ ఇస్తుండాలి. ఉల్లిపాయ ముక్క దగ్గర వుంచుకోవాలి. రోజుకు మూడుసార్లు చన్నీటితో స్నానం చేయించాలి. పిల్లలకు నీళ్లు వద్దన్నా కొంచెం కొంచెంగా నీరు తాగిస్తూ వుండాలి. బయటికి వెళ్తున్నప్పుడు నీరు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎండల్లో ప్రయాణం చేయకూడదు. ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం ఉదయం నీటిలో నానబెట్టి ఎండవేళ ఇవ్వాలి. 
 
చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత ఉపయోగకరం. పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు టోపీని ధరించి తీసుకెళ్లాలి. లేత రంగు బట్టలు ఉపయోగించాలి. మజ్జిగ, పెరుగు, ఆపిల్, దానిమ్మ, బొప్పాయి, అరటి, కారట్, బార్లీ నీళ్ళు, చల్లటి గంజి, నిమ్మరసం తాజా పల్ళు, కూరలు తీసుకోవచ్చు. అలాగే అరటి పండు, మామిడి, బొప్పాయి, పుచ్చ, దోస, నిమ్మజాతి పండ్లు తీసుకోవచ్చు.