శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 జులై 2014 (17:25 IST)

స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం పెడుతున్నారు?

స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం పెడుతున్నారు.. మీరు పెట్టే ఆహారంలో పోషక విలువలు ఉన్నాయా.. అనేది చూసుకోవాలి. తెల్లవారున ఏదో టిఫిన్, మధ్యాహ్నం ఏదో ఒక ఆహారం తర్వాత స్నాక్స్ మళ్లీ భోజనం... ఇలా ఏదో తంతుగా పిల్లలకు ఆహారం పెట్టకుండా.. పిల్లలు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
స్నాక్స్ పేరిట జంక్ ఫుడ్‌లకు పిల్లలను అలవాటు చేయకుండా 4 ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చే ఆహారంలో తప్పకుండా పోషకాలుండేలా చూసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ఇచ్చే ఆహారం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలి.
 
వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి... 
ఉదయం పూట ఏదైనా ఒక పండు, తేలికగా జీర్ణమయ్యే అల్పాహారం ఇవ్వాలి. ఇడ్లీ, దోసె, కోడిగుడ్డు, పాలు ఇవ్వడం ఉత్తమం. ఇంకా బ్రెడ్, సోయాబీన్స్, క్యారెట్, కీరదోస, వెజ్ శాండ్‌విచ్, ఎగ్ ఆమ్లెట్, ఓట్స్ కలిపిన పాలు వంటివి ఇవొచ్చు. 
 
మధ్యాహ్నం పూట.. 
ఒక రోజు మొత్తం ఇచ్చే ఆహారంలో మూడింట ఒక వంతు మధ్యాహ్న భోజనంలో ఉండేలా చూసుకోవాలి. అన్నం, కూరగాయలు, చేపలు మధ్యాహ్నం తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఉండాలి. ఇంకా పెరుగు ఇవ్వాలి. వెజిటేరియన్ పులావ్, చపాతీ, వెజిటబుల్ కర్రీ, పప్పు కూరలు కూడా మధ్యాహ్నం పూట చేర్చుకోవచ్చు. 
 
సాయంత్రం, రాత్రి పూట.. 
స్కూల్ నుంచి పిల్లలు ఇంటికొచ్చాక.. కాళ్లుచేతులు శుభ్రపరుచుకున్నాక ఉడికించిన శెనగలు, పప్పు దినుసులు, కొబ్బరితో చేసిన చిరుతిళ్లు ఇవ్వొచ్చు. అలాగే మినీ టిఫిన్‌లా దోసె, బ్రెడ్ శాండ్‌విచ్, అరటి పండ్లు ఇవ్వొచ్చు. వర్షాకాలంలో రాత్రి పూట పిల్లలు గోధుమ, బియ్యంతో తయారు చేసిన జావ చాలా మంచిది. అన్నమైతే రాత్రి పూటకు కూడా పప్పు కూరలు, వెజిటబుల్స్  చేర్చుకోవచ్చు. 
 
అబ్బాయిలకు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య, అమ్మాయిలకు 8 నుంచి 10 వయస్సు మధ్య మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. ఎముకలు, దంతాల పటిష్టతకు మీరిచ్చే ఆహారం తోడ్పడేలా ఉండాలి. అందుకే పిల్లలకు అందాల్సిన క్యాల్షియం కోసం రోజూ రెండు గ్లాసుల పాలు ఇవ్వండి. పాలు తాగని పిల్లలకు మిల్క్ షేక్ వంటివి తయారుచేసి ఇవ్వొచ్చు. పెరుగు, మజ్జిగ తప్పనిసరి. 
 
ఇంకా బాదంపప్పు, శెనగలు, బాదం, ఖర్జూరం వంటివి మధ్య మధ్యలో ఇస్తూ ఉండాలి. లేకుంటే మామిడి, అరటి, ఆపిల్, ఆరెంజ్, ద్రాక్ష పండ్లను ఇవ్వొచ్చు. శాలడ్స్ వంటివి ఇవ్వడం చాలా మంచిది. నూనెలో వేపిన చిప్స్, న్యూడిల్స్ వంటివి ఇవ్వకపోవడం మంచిది. న్యూడిల్స్ ఇవ్వాలనుకుంటే అందులో క్యారెట్, బీన్స్, క్యాబేజీ, వెల్లుల్లి, క్యాప్సికమ్, పచ్చి బఠాణీలు తరుగు చేర్చి ఇవ్వడం మంచిది. ఇంకా కోడిగుడ్డు, చికెన్, మటన్, చేపలను వారానికి రెండుసార్లైనా ఆహారంలో చేర్చుకోవాలి.