గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 మార్చి 2015 (17:12 IST)

పిల్లలు కూడా టేబుల్ మ్యానర్స్‌ని పాటించాలంటే?

పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి. పిల్లలకు తయారు చేసే పదార్థాలు వీలైనంతవరకు రెండు రకాలుగా ఉండే విధంగా శ్రద్ధ వహించాలి. ఆ రెండింటిలోనే వారికి ఛాయిస్ ఇస్తుంటే ఒకదాన్ని తప్పకుండా తిని తీరతారు. ఒకవేళ తినడానికి అయిష్ట వ్యక్తం చేస్తే సాధించడమో, మరో కొత్త పదార్థం చేయడానికి ప్రయత్నించడమే చేయకూడదు. పదార్థాలలో వెరైటీని పిల్లలు కచ్చితంగా ఇష్టపడతారు. 
 
పిల్లలు టేబుల్ మ్యానర్స్‌ని పాటించాల్సిందే అయితే ఈ విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం సరికాదు. ఇలా చేస్తే వారు తినడానికి ఇబ్బంది పడతారు. రోజుకు రెండు మూడు కప్పుల పాలు, ఒక గ్లాసు పండ్ల రసాలకు పరిమితం చేయాలి. ఎక్కువ శీతల పానీయాలు తాగే పిల్లలు ఇతర పదార్థాలను తగ్గించేస్తారు. 
 
ఫలానాది తింటే ఇది ఇస్తా, అది ఇస్తా అంటూ వారికి లంచాలు చూపకూడదు. ఎక్కువగా చిరుతిండ్లు తినే అలవాటున్న పిల్లలు పోషకాహారం వైపు పెద్దగా దృష్టి సారించరు. ఇంట్లోని పెద్దలు స్పైసీగా ఉండే పదార్థాలు, ఇతర చిరుతిండ్లు తింటూ పిల్లలకు సలాడ్లు, పండ్లు ఇస్తుంటే వారు ససేమిరా అంటారు. కాబట్టి పెద్దలే పిల్లలకు రోల్ మోడల్స్ కావాలి.