శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 జూన్ 2015 (18:36 IST)

పిల్లలు హుషారుగా స్కూలుకు వెళ్లాలంటే?

కొత్త విద్యా సంవత్సరానికి పాఠశాలలు తెరిచారు. వేసవి సెలవులలో ఆట పాటలతో హుషారుగా గడిపిన పిల్లలు తిరిగి స్కూల్ యూనిఫామ్ వేసుకుని స్కూల్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. స్కూల్ మళ్ళీ కొత్తగా ఆరంభం కాగానే హుషారుగా వెళ్ళే విద్యార్థులు తక్కువ, ఎందుకొచ్చిన  స్కూల్ అనుకునే పిల్లలే ఎక్కువ. ఆటలు, సెలవుల మూడ్ నుండి స్కూల్ చదువు మూడ్‌లో రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం వారికివ్వండి. 
 
మొదటిరోజు నుంచే చదువు ఒత్తిడి పెడితే పిల్లలు చదువు పట్ల వ్యతిరేక భావం ఏర్పరుచుకుంటారు. కొందరైతే డిప్రెషన్‌లోకి వెళతారు. కాబట్టి స్కూల్ మొదటివారం రోజులు వారి యూనిఫామ్, స్కూల్‌లో వచ్చిన మార్పులు, షూస్ కొత్త పుస్తకాలు, వాటి అట్టలు ఇలాంటి కబుర్లతో పిల్లలను క్రమంగా మూడ్‌లోకి తీసుకురండి. మళ్ళీ చదువులో పడ్డాక పెద్దల అవసరం అంతగా ఉండదని, అప్పుడే పిల్లలూ స్కూల్స్‌కు కూడా హుషారుగా వెళ్తారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.