మంగళవారం, 19 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By ivr
Last Modified: శనివారం, 6 ఆగస్టు 2016 (18:54 IST)

నదీస్నానం పరమపవిత్రం... కృష్ణా పుష్కరాలు వచ్చేవారమే...

మన దేశం ఎన్నో పుణ్యనదీనదాలకు నిలయం. దేవతలు కూడా ఇక్కడి నదుల్లో పుణ్యస్నానాలు చేశారని మన పురాణాలు చెపుతున్నాయి. అంతటి మహిమాన్వితమైన నదీ స్నానం కృష్ణాపుష్కరాల సందర్భంగా మరోసారి భక్తుల ముందుకు వస్తుంది. నదీనద తీర్థస్నానాలు, భక్తిశ్రద్ధలతో, విశ్వాసంతో, ద

మన దేశం ఎన్నో పుణ్యనదీనదాలకు నిలయం. దేవతలు కూడా ఇక్కడి నదుల్లో పుణ్యస్నానాలు చేశారని మన పురాణాలు చెపుతున్నాయి. అంతటి మహిమాన్వితమైన నదీ స్నానం కృష్ణాపుష్కరాల సందర్భంగా మరోసారి భక్తుల ముందుకు వస్తుంది. నదీనద తీర్థస్నానాలు, భక్తిశ్రద్ధలతో, విశ్వాసంతో, దైవీభావంతో చేస్తే అవి మనకు అనంతమైన పుణ్యాన్ని, ఆత్మతత్త్వాన్ని ప్రసాదించి, పునర్జన్మ లేకుండా చేస్తాయి. 
 
భరతభూమి విశ్వవిఖ్యాతి పొందడానికి ముఖ్యకారణం ఇక్కడ ఉండే పవిత్ర పర్వతశ్రేణులు, పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, తీర్థాలే. గంగాది పుణ్యనదీ తీరాల్లో మహర్షులు, చక్రవర్తులు, ఎన్నో యజ్ఞాలు చేసి, యజ్ఞ శేష పదార్థాలైన భస్మం తదితరాల్ని నదీజలాల్లో కలిపారు. ఎందరో తపస్సులు చేసి, తపశ్శక్తిని అర్ఘ్యప్రదాన రూపంలో ఆయా నదీ జలాల్లో సమర్పించారు. కనుక తరచుగా నదీనదజల స్నానం వల్ల ఎంతో పుణ్యం, ఆరోగ్యం కలుగుతుంది. పుణ్యనదుల పేర్లు స్మరిస్తూ ఇంట్లో ఉండే నీళ్లతో స్నానం చేసినా నదీ స్నానఫలం దక్కుతుందని విశ్వాసం.