శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (09:33 IST)

నేను ఓటు వేశా.. మీరంతా ఓటు వేయండి : రజినీకాంత్ పిలుపు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యంగా, దక్షిణాదిలో అత్యంత కీలక రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి తన సొంతూరైన సేలం జిల్లాలోని ఎడప్పాడిలో ఓటు వేశారు. అలాగే, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
ఈ పోలింగ్‌లో అనేక సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నై సెంట్రల్ పార్లమెంటరీ స్థానంలో ఆయన తన ఓటు వాడుకున్నారు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకోగానే చూసేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. పొలిటీషియన్‌గా మారిన రజినీకాంత్ లోక్‌సభ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు కాంగ్రెస్‌ నేత చిదంబంరం తమిళనాడులోని కారైకుడి శివగంగలో తన ఓటు హక్కు వాడుకోగా.. కాంగ్రెస్‌ నేత సుశీల్‌కుమార్‌ షిండే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓటు హక్కు వాడుకున్నారు. అలాగే, బెంగుళూరు లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.