ప్రియతమా! ఏమని పిలువను...?!!

సోమవారం, 30 జనవరి 2012 (14:22 IST)

WD
ప్రియతమా!
ఏమని పిలువను...
మనసు అలజడితో ఊగుతున్నప్పుడు..
నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు..
బ్రతుకు ప్రశ్నార్థకమై చౌరస్తాలో నిలిచినప్పుడు..

నేనున్నానంటూ పలకరించావు
నీకు నువ్వు నాకు నేను అంటూ
మనం పాడుకునే చెణుకును గుర్తు చేస్తూ..

ప్రపంచం సాక్షిగా..
మనం నడకను కొనసాగిద్దామంటూ...
మనిషితనం మన పునాదిగా చేసుకుందామంటూ...

నువ్వొచ్చావు.
ఆశాజీవన లతలను మోసుకుంటూ నువ్వొచ్చావు..
సెలయేటి పాటలా నువ్వొచ్చావు..

నువ్వూ నేనూ లేని జీవితం..
నీకూ నాకూ లేని జీవితం..
జీవితం కాదంటూ
నువ్వొచ్చావు...

సువిశాల జగతిలో మనిషికి ఎంత చోటు కావాలంటూ...
ఎందుకు జీవించలేమంటూ...
ఒక పురావిశ్వాసాన్ని తలపుకు తెస్తూ...
నువ్వొచ్చావు..

జనజీవన సంస్కృతులను
కళ్లముందు ఆవిష్కరిస్తూ...
ఇన్నాళ్లుగా.. మనిషి సాగిస్తున్న
సహస్ర వృత్తుల శ్రమజీవిత పాఠాలు నేర్పుతూ..
నువ్వొచ్చావు...

ప్రియతమా....
ఏమని పిలువను?
నిన్ను ఏమని పిలవను?దీనిపై మరింత చదవండి :  
ప్రేమ కవిత రొమాన్స్

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

"ప్రేమికుల రోజు" కథ ఏంటో మీకు తెలుసా?

మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ ...

వాలెంటైన్ డే: మీ రాశికి అనుగుణంగా ప్రేయసి/ప్రియునికి గిఫ్ట్

వాలెంటైన్ డే సెలబ్రేషన్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తమ తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను ...