ప్రియా.... నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు

WD
ప్రియా...

నాపై ప్రసరించిన నీ తొలిచూపుల కిరణాలు
నా హృదిలో వీణను మీటాయి

నాపై విసిరిన నీ చిరునవ్వుల బాణాలు
నాలో మల్లెల విరివానలు కురిపించాయ్

ఒకానొక రోజున అంటీ అంటనట్లు తగిలిన నీ చేతి స్పర్శ
ఒక్కసారిగా నా మనస్సును మత్తెక్కించింది

ఒంటరిగా ఉన్న నీ మనసుకు తోడుకావాలన్నప్పుడు
ఒట్టు... అది కలయేమోనని భ్రమపడ్డా

అది కలకాదు నిజం అని నీ వెచ్చని స్పర్శ చెప్పింది
అది కల్లకాదు నిజమేనని నీ పెదవులు చెప్పాయ్

నిజంగా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు
నీతోటి స్నేహం అధరాల సాక్షిగా... మధురాతి మధురం

నీ రాక కోసం...
నీ పలుకు కోసం...
నీ పిలుపు కోసం...

ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా...



దీనిపై మరింత చదవండి :  

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

అమ్మాయిలను బుట్టలో వేసుకోవాలంటే..?

అమ్మాయిలను బుట్టలో వేసుకోవాలంటే..? అమ్మాయిలకు నచ్చే లిప్‌స్టిక్‌ను కొనిపెట్టండి ...

యూజర్‌నేమ్ - పాస్‌వర్డ్‌ చెప్పే ప్రేమ అకౌంట్

అబ్బాయి ప్రేమ USER NAME లాంటిది...చూసేవాళ్ళందరికీ కనిపిస్తుంది...అమ్మాయి ప్రేమ PASSWORD ...