ప్రేమను త్యాగం చేద్దామంటున్నావ్... ఇదేనా ప్రేమంటే...

Venkateswara Rao. I|
WD
నేను అడగ కుండానే నా జీవితంలోకి ప్రవేశించావు
అంధకారమైన నా జీవితంలో ఆశల హరివిల్లులు చూపించావు
మోడు వారిన నా జీవితంలో ప్రేమను చిగురింప చేశావు
ఊహల ఊయలలో విహరింప చేశావు
నా ఆశ నువ్వు, నా శ్వాస నువ్వు, నా సర్వస్వం నువ్వనుకున్నా.....
నా హృదయ మందిరంలో గుడి కట్టి పూజించుకున్నా.....

కానీ..... ఏమిటీ అలజడి..... ఎందుకింత మోసం.......
ఈ క్షణం నా గుండె ఆగిపోతే బావుండునేమో కదా.....
ఈ భారం నే మోయలేను
నా కలల్ని కల్లలు చేశావు.. ఆశల్ని అడియాశలు చేశావు..
నాతోనే జీవితం అన్నావు.. నా కోసమే పుట్టానన్నావు..
మరి ఈ రోజు ఎవరికోసమో మన ప్రేమను త్యాగం చేద్దామంటున్నావ్
ఇదేనా ప్రేమంటే .......


దీనిపై మరింత చదవండి :