Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ యిలలో..

Widgets Magazine

WD
ప్రేమ హృదయాలను అర్థం చేసుకోవడం... ఆకళింపు చేసుకోవడం ఒక్క కవికే సాధ్యమని గతంలో ఎందరో చెప్పారు. ఆ కవులు ప్రేమికుల భావాలు ఎలా ఉంటాయో తెలుపుతూ ఎన్నో గీతాలను అందించారు. వాటిలో అమృతాన్ని పంచేవి, విరహాన్ని పెంచేవి, ప్రేమ మైకంలో దించేవి ఎన్నో... ఎన్నెన్నో.

ప్రేమ తాలూకు తీయని మత్తు, విరహాలు ఎంత కమ్మటి అనుభూతులను పంచుతాయో... ప్రేమించిన వ్యక్తిని పొందలేనపుడు ఆ మనసు పడే వైరాగ్యం అంత బాధను మిగులుస్తుంది. వీటన్నిటి కలబోతగా ఆచార ఆత్రేయ ఓ గీతంలో అందించారు.. ఒక్కసారి చూద్దామా...!!

విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేననీ
విరహాన వేగిపోయే విలపించే కథలు ఎన్నో || విధి ||

ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్లు గడిపెను శకుంతలా
విరహ బాధను మరచిపోవగా నిదుర పోయెను ఊర్మిళా
అనురాగమే నిజమనీ మనసొకటి దాని రుజువనీ
తుది జయము ప్రేమకేననీ బలియైనవి బ్రతుకులెన్నో || విధి ||

వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ యిలలో
కులము మతము ధనము బలము గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగరాదనీ ఎడబాటి లేచినాము
మన గాథ యువతరాలకు కావాలి మరో చరిత్ర
కావాలీ మరో చరిత్రా...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

శోభనం గదిలో భార్యాభర్తలు ఎలా ప్రవర్తించాలి?

స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవం, కొత్త పరిసరాలంటే కొంత జంకుగా ...

ప్రేమలో ఉన్నారా... అయితే లవర్‌తో ఇలా మాట్లాడొద్దు!

ప్రియురాలితో లేక జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలని నిపుణులు ...

Widgets Magazine