మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : గురువారం, 31 మార్చి 2016 (10:33 IST)

భార్య ఏడుస్తుందా.. కళ్లను ముద్దు పెట్టుకోండి...

సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అవి కుటుంబ వ్యవహారాలు కావొచ్చు.. శృంగార పరమైన అంశాల్లో కావొచ్చు. అలాంటి సందర్భాల్లో ఆడవారి మనస్సు చాలా సున్నితమైనది కావడంతో వారు బోరున ఏడ్చేస్తారు. ఇలాంటి సమయాల్లో భార్య అనురాగాన్ని తిరిగి పొందాలంటే ప్రతి భర్త తన భార్య పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపాల్సిందే. లేదంటే... ఇద్దరి మధ్య కష్టాలు తప్పదు. 
 
ముఖ్యంగా, తన భాగస్వామి మాటకు నలుగురిలో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నడుచుకోవాలి. ఆమెకు ఏదైనా ఇస్తానని చెప్పినప్పుడు ఆ మాటను తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆమె మనస్సు నొప్పిస్తే ఆమె ఏడిస్తే వెంటనే భర్త ఆమెను తన కౌగిలిలోకి బందించి ఓదార్చడానికి ప్రయత్నం చేయాలి.
 
ఆమె ఏడుస్తుంటే నాకేంటి అని పక్కకు తప్పుకోకూడదు. ఆమె కన్నీటిని మృదువుగా లాలిస్తూ తుడవాలి. ఆమె కళ్లను ముద్దు పెట్టుకోవాలి. భార్య ఉగ్రరూపంతో ఊగిపోతుంటే.. పక్కపైకి తీసుకెళ్లి ఆమె కోపాన్ని చల్లార్చేందుకు ప్రయత్నం చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల ఆమె కోపాగ్ని చల్లారిపోయి తిరిగి సహజ స్థితికి వస్తుంది. 
 
ఇలా చేయడం వల్ల భార్య ముందు తమ ఆధిపత్యం తగ్గిపోతుందనే భావన భర్తల్లో దరిచేరనీయకూడదు. తమ పురుష లక్షణాలను కొద్దిసేపు పక్కన పెట్టి.. భార్యను ప్రేమతో తమ కౌగిట్లోకి తీసుకుని బుజ్జగిస్తే అంతా సర్దుకుపోతుదని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.