గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (16:51 IST)

ప్రేమ సందేశం పంపడానికి.. ఈ మెయిలే బెస్ట్..!: పాజిటివ్‌గా.. ఆకర్షణీయంగా..?

ప్రేమ సందేశాన్ని పంపేందుకు వాయిస్ మెయిల్, ఫోన్ కాల్ కంటే ఈ మెయిలే బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. ప్రేమ సందేశం పంపేటప్పుడు వాయిస్ మెయిల్, ఫోన్ కాల్ కంటే ఈ-మెయిల్‌ ద్వారానే అద్భుతమైన భావవ్యక్తీకరణ ఉంటుందని వారు చెబుతున్నారు. ఫోన్ కాల్ లేదా వాయిస్ మెయిల్ ద్వారా వ్యక్తీకరించలేని వాటిని కూడా మెయిల్‌లో అందంగా చెబుతున్నారని వారు వెల్లడించారు. 
 
ప్రేమ సందేశానికి మెయిలే అద్భుతమైనదని అమెరికా నిపుణులు వెల్లడించారు. ప్రేమ సందేశాలు మెయిల్‌లో అయితే పాజిటివ్‌గా ఆకర్షణీయంగా రాస్తారని వారు తేల్చారు. ఈ మెయిల్ రాసేటప్పుడు ఉద్దేశ పూర్వకంగా, లేక ఊహించని విధంగా కానీ మంచి భాష, మంచి భావం, ఆకర్షణీయమైన విధానంలో వ్యక్తీకరిస్తున్నారని వారు చెప్పారు. అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపారం సంబంధిత అంశాలను వ్యక్తం చేసుకోవడానికి కూడా ఈ మెయిల్ మంచి ఎంపిక అని నిపుణులు చెప్తున్నారు.
 
72 కాలేజీల్లో చదివే విద్యార్థులపై నిర్వహించిన స్టడీలో ఈ విషయం తేలిందని ఇండియానా యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. ఈమెయిల్స్ ద్వారా పంపే రొమాంటిక్ ఈ మెయిల్స్ ప్రేమ బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయని, భావోద్వేగాలను ఉట్టిపడేలా చేస్తాయని పరిశోధకులు చెప్పారు.