మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : బుధవారం, 27 జనవరి 2016 (12:05 IST)

ప్రేమను తెలపాలంటే ఎర్రగులాబీని ఎందుకు ఎంచుకుంటారు?

సౌందర్య సాధనంగా ఉపయోగించే పువ్వులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూలు ప్రేమను, ఆకర్షణను కలిగించి మనస్సుకి ఆహ్లాదాన్నిస్తాయి. అలసిన శరీరానికి మనసుకు చక్కటి పూలమొక్కలు ఆహ్లాదాన్నిస్తాయి. అందమైన గార్డెన్ మనస్సుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. అదేవిధంగా, మంచి సువాసననిచ్చే పూలు, మొక్కలు జీవితంలో రొమాన్స్ కలిగిస్తాయి. 
 
ఇంటి వద్ద మంచి రొమాంటిక్ మూడ్ తెచ్చుకోవాలంటే మీ గార్డెన్‌లో, ఇంటిలోపలి భాగంలో పెంచగల కొన్ని పూల మొక్కలు చూస్తే సరి. బిజీ జీవితం నుంచి విశ్రాంతి పొందాలంటే మంచి మార్గం ప్రకృతితో స్నేహం చేయడం. కాసేపు పూలతో, చెట్లతో ముచ్చట్లాడి వాటి బాగోగులు చూసుకుంటే చాలు ఎంతటి ఒత్తిడి అయినా ఇట్టే మటుమాయం అవుతుంది. వాటికి కాస్త సేవ చేస్తే ఇటు వ్యాయామమూ అవుతుంది, అటు తోట పని కూడా పూర్తవుతుంది. 
 
పూలను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత కలుగుతుంది. ఒక్కొక్క పూవుది ఒక్కో సువాసన. పూల రంగు, సువాసనల ప్రభావం మనిషి మీద ఉంటుంది. ప్రేమను తెలియజేసే కొన్నిఆకర్షణీయమైన పువ్వుల గురించి తెల్సుకుందాం!
 
ఎర్రటి గులాబి పువ్వు, చూసే వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎవరికైనా వెంటనే ఇవ్వాలనిపిస్తుంది. ప్రేమను తెలుపాలంటే ఎర్ర గులాబి మంచి సాధనం. వీటిలో అనేక రంగులుంటాయి. ఈ మొక్కను కుండీలలో, బయట కూడా పెంచవచ్చు. ముళ్ళను ఎప్పటికపుడు తీసేస్తూ ప్రతిరోజూ ఒకసారి నీరు పెట్టి, కొద్దిపాటి సూర్యరశ్మి తగిలితే చాలు మొక్క బాగా ఎదిగి పూలనిస్తుంది. గులాబీపూలు మనిషి మూడ్‌ను మారుస్తాయి. ఎంతో విచారంలో ఉన్న వారికి గులాబీలు అందించినట్లయితే వారి మనసులో ఆనందం మొదలవుతుంది.
 
గులాబీ తర్వాత ప్రేమను తెలపాలంటే ప్లుమేరియా పువ్వు సహాయపడుతుంది. మంచి సువాసనలతో గదంతా ఆహ్లాదాన్నిస్తుంది. ఈ పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. పెంచటం తేలికే. చలి అధికంగా ఉంటే, ఇంటి లోపల కుండీలలో పెంచటం మంచిది, కొద్దిపాటి నీరు పెడితే చాలు.
 
మల్లెపూలు ఘాటైన సువాసనలనిచ్చే ప్రేమికుల పువ్వు. ఇవి అలంకరణకే మంచి మూడ్ రావటానికి కూడా ఉపయోగిస్తారు. ఇవి వికసించాలంటే ఎండ బాగా వుండాలి. నీరు ఎక్కువ పోస్తే మొక్క బాగా ఎదుగుతుంది. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమేకాక మాడుకు చల్లదనాన్నిస్తుంది. 
 
మందారం పూలు కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించవచ్చు. దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు.
 
రాత్రి వికసించే ఈ పూవును మూన్ ఫ్లవర్ అని పిలుస్తారు. మూన్ వలే గుండ్రంగా ఉండటం వలన దీనిని మూన్ ఫ్లవర్ అంటారు. ఈ పూవు కూడా తెల్లగా వుంటుంది. ఇది పాకే మొక్క, బలంగా వుంటుంది. ఈ పూలు రాత్రి పూట వికసించి సువాసనలు వెదజల్లుతూ మనకి మత్తు కలిగేవిధంగా చేస్తుంది.